ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖపై సీఎం జగన్ కీలక సమీక్ష.. సీడీపీఓ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

CM Jagan Gives Green Signal For Fill up CDPO Posts During Review on Women and Child Welfare Department,CM Jagan's critical review,AP Women and Child Welfare Department,filling CDPO posts,Mango news,mango news telugu,Sajjala Ramakrishna Reddy Latest News and Updates,Tdp Chief Chandrababu Naidu,AP CM YS Jagan Mohan Reddy,YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates,CDPO Posts,Women and Child Welfare Department

ఆంధ్రప్రదేశ్ లోని చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (సీడీపీఓ) పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఏపీ మహిళా, శిశు సంక్షేమ శాఖపై సమీక్ష సందర్భంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన ఈ సమీక్షకు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్, సీఎస్ జవహర్ రెడ్డి, మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి రవిచంద్ర సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పలు కీలక సూచనలు ఇచ్చారు.

మహిళా శిశు సంక్షేమ శాఖపై సమీక్షలో సీఎం జగన్ చేసిన కొన్ని కీలక ఆదేశాలు, సూచనలు..

  • రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీలలో ఖాళీగా ఉన్న 61 సీడీపీఓ పోస్టుల భర్తీకి ఆమోదం.
  • ఈ పోస్టుల నియామకాలను ఏపీపీఎస్సీ ద్వారా చేపట్టనున్నట్లు తెలిపిన అధికారులు, వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశం.
  • అంగన్‌వాడీలలో పిల్లలకు అందించే న్యూట్రిషన్ కిట్ నాణ్యతతో ఉండాలి.
  • అలాగే అంగన్‌వాడీలలో భోజనం కోసం నాణ్యమైన సార్టెక్స్ రైస్ అందించాలి.
  • ఇటీవల నియమితులైన సూపర్‌వైజర్‌లతో తరచుగా అంగన్‌వాడీలలో తనిఖీలు నిర్వహించాలి.
  • అంగన్‌వాడీల స్థాయి నుంచే పిల్లల్లో విద్యతో పాటు భాషపై కూడా పట్టు ఉండేలా చర్యలు చేపట్టాలి.
  • అంగన్‌వాడీలలో పనితీరుని పర్యవేక్షించేందుకు సూపర్‌వైజర్స్ వ్యవస్థను సమర్ధవంతంగా వినియోగించుకోవాలి.
  • ‘నాడు-నేడు’ పథకం కింద చేపడుతున్న వివిధ పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలి.
  • ఏపీ ప్రభుత్వం విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, గృహనిర్మాణం మరియు మహిళా శిశు సంక్షేమ శాఖకు ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ఆయా విభాగాలు అత్యుత్తమ పనితీరు కనబరచాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + 12 =