కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అన్నంత పని చేశారు. పిఠాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరును మార్చుకుంటానని ముద్రగడ పద్మనాభం ఎన్నికలప్పుడు శపథం చేశారు. అటు ఎన్నికల్లో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలుపొందారు. ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు. దీంతో తాను శపథం చేసినట్లుగానే తన పేరును ముద్రగడ పద్మనాభం నుంచి ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నారు. అంతటితో ఆగకుండా ముద్రగడ పవన్ కళ్యాణ్‌పై మరోసారి రెచ్చిపోయారు.
ఇటీవల పవన్ కళ్యాణ్, జనసైనికులపై ముద్రగడ పద్మనాభ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ మద్ధతుదారులు తనను హేళన చేస్తున్నారని.. చాటుమాటు మాటలు అంటున్నారని చెప్పుకొచ్చారు. బండ బూతులు తిడుతున్నారని.. తనపై దాడులు చేసేందుకు కూడా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. అయితే ముద్రగడ వ్యాఖ్యలను జనసైనికులు లైట్ తీసుకున్నారు. కానీ ఆయన కూతరు క్రాంతి స్పందిస్తూ.. ముద్రగడకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. తన తండ్రి పేరు మార్చుకున్నప్పటికీ ఆయన ఆలోచనా విధానాన్ని మాత్రం మార్చుకోలేదని భగ్గుమన్నారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్‌ను ఎప్పుడూ ప్రశ్నించని తన తండ్రి.. పవన్ కళ్యాణ్‌ను మాత్రం ఎందుకు ప్రశ్నిస్తున్నారని నిలదీశారు. సమాజానికి ఏం చేయాలన్న దానిపై పవన్ కళ్యాణ్‌కు ఒక స్పష్టత ఉందని.. ఆ విషయంలో తన తండ్రికి అలాంటిదేమీ లేదని అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. తన తండ్రి తన శేష జీవితాన్ని ఇంటికే పరిమితం చేసి విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇచ్చారు. అంతేకాకుండా మరోసారి పవన్ కళ్యాణ్‌పై వ్యాఖ్యలు చేస్తే తాను గట్టిగా ప్రతిఘటిస్తానని హెచ్చరించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY