లీడ‌ర్ విత్ హ్యూమ‌న్‌.. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌!

Leader With Humanity.. Pawan Kalyan!, Leader With Humanity, Pawan Kalyan Humanity Leader, Humanity Leader Pawan Kalyan, Humanity, AP People,YCP, TDP, BJP, Congress, Janasena, Chandrababu, Jagan, Pawan Kalyan, Sharmila, Assembly Elections, Lok Sabha Elections, AP Live Updates, TS Live Updates, Political News, Mango News, Mango News Telugu
AP people,YCP, TDP, BJP, Congress, Janasena, Chandrababu, Jagan, Pawan Kalyan, Sharmila, Leader with Humanity.. Pawan Kalyan!

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు మ‌ద్ద‌తుగా అన్న మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేసిన ఓ వీడియోలో చెప్పిన‌ట్లుగా.. త‌న గురించి కంటే.. ఎదుటి వారికి మంచి క‌ల‌గాల‌నే మ‌న‌స్త‌త్వం క‌ల్యాణ్‌ది. ఈ విష‌యాన్ని పార్టీల‌కు అతీతంగా చాలా మంది చెబుతుంటారు. అలాగే.. రాజ‌కీయ నాయ‌కుడు ఎవ‌రైనా గెలిచాక ప్ర‌జ‌ల‌కు ఏదైనా చేయాల‌ని అనుకుంటారు. కానీ క‌ల్యాణ్‌.. త‌న సంపాద‌న‌లో కొంత భాగాన్ని మొద‌టి నుంచి ఆప‌ద‌లో ఉన్న‌వారిని ఆదుకోవ‌డానికి వెచ్చిస్తున్నారు. ప్ర‌కృతి విపత్తుల నుంచి, ప్రభుత్వ వైఫల్యాల వరకు రాష్ట్రంలో సమస్య ఏదైనా జనం కోసం నేనున్నాను అంటూ ముందుకు రావ‌డం.. ఆయ‌నకు రాజ‌కీయాల్లోకి రాక ముందు నుంచీ ఉంది. రాజ‌కీయాల్లోకి వ‌చ్చాక కూడా స‌రికొత్త సంస్కృతికి శ్రీ‌కారం చుట్టారు. అధికారం వ‌స్తుంద‌నో, రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు ప్ర‌ణాళిక‌లు వేసుకునో కాకుండా ఎక్క‌డ‌, ఎవ‌రికి ఆప‌ద ఉన్నా వెంట‌నే స్పందించేవారు.

రాష్ట్రంలో పూట గ‌డ‌వక  కౌలు రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటే.., ఆ కుటుంబాల‌ను ఆదుకునేందుకు స్వ‌తాహాగా ముందుకు వ‌చ్చారు. త‌న సొంత డ‌బ్బును ఒక్కో కౌలు రైతు కుటుంబానికి ల‌క్ష చొప్పున అందించారు. ఎంత మందికి ఇచ్చారో స్ప‌ష్ట‌మైన లెక్కా లేదు.. దాని గురించి అంత‌గా ప్ర‌చార‌మూ చేసుకోలేదు. ఓ అంచ‌నా ప్ర‌కారం.. సుమారు 3000 మందికి అంటే రాష్ట్ర వ్యాప్తంగా 30 కోట్ల రూపాయ‌లు స‌హాయం చేసి ఉంటార‌ని తెలుస్తోంది. ఒక పులివెందుల నియోజ‌క‌వ‌ర్గంలోనే 173 మంది కౌలు రైతుల కుటుంబాలకు మొత్తం రూ.1.73 కోట్లు పంపిణీ చేశారు.

ఏ ప‌ద‌వీ, ఏ అధికార‌మూ లేక‌పోయినా ఎంతో మంది కౌలు రైతుల కుటుంబ స‌భ్యుల క‌న్నీళ్లు తుడిచారు. అయిన‌ప్ప‌టికీ.. ఈ ఎన్నిక‌ల్లో ఎక్క‌డా దాని గురించి హైలెట్ చేసుకోలేదు. ఎందుకంటే.. అన్యాయాన్ని ఎదిరించ‌కుండా మౌనంగా ఉండే మంచి వాళ్ల వ‌ల్లే ప్ర‌జాస్వామ్యం మ‌రింత న‌ష్ట‌పోతుంద‌ని న‌మ్మి ప్ర‌జ‌ల కోసం రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు కానీ, పేరు కోస‌మో, సంపాద‌న కోస‌మో కాదు. పార్టీప‌రంగా ఆయ‌న రాష్ట్రమంత‌టా ప‌ర్య‌టించారు. పార్టీని బ‌లోపేతం చేశారు. పవన్ కల్యాణ్ స్వయంగా పలు సమస్యలపై కదిలారు. అనంతపురం వంటి జిల్లాల్లో రోడ్ల సమస్య మీద ఆయన ఆందోళన చేశారు. నెల్లూరు జిల్లాలో మత్స్యకారుల సమస్య మీద స్పందించారు. కౌలుదారుల మరణాలపై అన్ని జిల్లాల్లోనూ కార్యక్రమాలు చేశారు. అయిన‌ప్ప‌టికీ.., పొత్తులో భాగంగా ఎక్కువ సీట్లు కోర‌లేదు. సానుభూతి గల

నాయకులు తమ జట్టు పట్ల సానుభూతిని పెంపొందించుకోవాలి. అదే ప‌వ‌న్ అవ‌లంభించారు. దురదృష్టవశాత్తు, ప్ర‌స్తుతం మెజారిటీ నాయకులు నియంతృత్వ ధోరణిని అవలంబిస్తున్నారు. కానీ ప‌వ‌న్ అందుకు భిన్నం. కూట‌మి స‌మ‌ష్టిగా ముందుకు పోవ‌డ‌మే ల‌క్ష్యం నిర్దేశించుకుని, అన్ని అవ‌మానాల‌ను, విమ‌ర్శ‌ల‌ను స్వీక‌రించి, అంద‌రినీ స‌మాధాన‌ప‌రచి కూట‌మిని బ‌ల‌మైన శ‌క్తిగా మార్చారు.

న‌న్ను న‌మ్మండి.. వ్యూహం నాకు వ‌దిలేయండి.. అని జ‌న‌సైనికుల‌కు తెలియ‌జేసి అస‌లైన నాయ‌కుడిగా వ్య‌వ‌హ‌రించారు. ఉత్తమమైన‌ నాయకులు తమ బృందం పనితీరుకు పూర్తి బాధ్యత వహిస్తారు. ఫలితం గురించి ఆశించ‌కుండా ముందు ప్ర‌య‌త్నం మొద‌లుపెడ‌తారు. రాజకీయం అంటే ఐదు నిమిషాల నూడుల్స్‌ కాదని, ఒడిదుడుకులు, ఒడిదుడుకులను తట్టుకుని ప్రజల నమ్మకాన్ని సంపాదించుకోవాలని, త్వరగా ఫలితాలు వస్తాయని ఆశించలేమని న‌మ్మిన జ‌న‌సేనాని స్వ‌ప్ర‌యోజ‌నాలు ఆశించ‌కుండా కూట‌మి ల‌క్ష్యాన్నే దృష్టిలో పెట్టుకుని ఈ ఎన్నిక‌ల్లో రాజ‌కీయాలు చేశారు. చంద్ర‌బాబు జైలులో ఉన్న‌ప్పుడు ఇదే అవ‌కాశంగా భావించి.. తెలుగుదేశాన్ని తొక్కేయాల‌ని చాలా మంది ప‌వ‌న్‌కు స‌ల‌హాలు ఇచ్చారు. కానీ.. ప‌వ‌న్ ఆ దిశ‌గా ఆలోచించ‌కుండా రాజ‌కీయ పార్టీ క‌ల్చ‌ర్ ను మార్చేశారు. అవ‌కాశవాద రాజ‌కీయాల‌కు చెక్ పెట్టారు. రాష్ట్ర ప్ర‌జ‌ల కోసం టీడీపీతో క‌లిసి ప‌నిచేయ‌నున్న‌ట్లు ఆ జైలు వ‌ద్దే ప్ర‌క‌ట‌న చేశారు. రాజ‌కీయాల్లో విలువ‌ల‌కు ప్రాధాన్యం ఇచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here