అనంతపురం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు అనంతపురం, యాడికి, పామిడి, తాడిపత్రి, కదిరి తదితర ప్రాంతాల్లో ఆదివారం (జూన్ 21) నుంచి వారం రోజుల పాటు లాక్‌డౌన్ ఆంక్షలు విధిస్తున్నట్లు కలెక్టర్ గంధం చంద్రుడు, ఎస్పీ సత్య ఏసుబాబు వెల్లడించారు. కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న గ్రామాలు, పట్టణాల్లో లాక్‌డౌన్ ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పారు.
ఉదయం 6 గంటల నుంచి 11 గంటల దాకా నిత్యావసర వస్తువుల దుకాణాలుకు అనుమతి ఉంటుందని, మిగతా అన్ని దుకాణాలు మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఆటోలు, క్యాబ్ లు, ఇతర ప్రైవేటు వాహనాలపై కూడా నిషేధం ఉంటుందని స్పష్టం చేశారు. అయితే ఆర్టీసీ బస్సు సేవలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు యథాతథంగా నడుస్తాయని పేర్కొన్నారు. వారం తర్వాత పరిస్థితులని బట్టి ఆయా ప్రాంతాల్లో లాక్‌డౌన్ కొనసాగింపు, ఎత్తివేతపై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu