ఆంధ్రప్రదేశ్‌లో మంత్రి నారా లోకేష్‌ను డిప్యూటీ ముఖ్యమంత్రిగా చేయాలంటూ టీడీపీ నేతల నుంచి భారీ డిమాండ్లు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఇవాళ టీడీపీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. లోకేష్‌ను డిప్యూటీ ముఖ్యమంత్రిగా నియమించాలా అన్న అంశంపై కూటమిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, ఆలోపు ఎవరు బహిరంగంగా వ్యాఖ్యలు చేయవద్దని పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేసింది.
అయితే ఈ నిర్ణయం తర్వాత పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన నారా లోకేష్ భవిష్యత్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మారతారని ప్రకటించారు. “ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా లోకేష్ కాబోయే ముఖ్యమంత్రే,” అంటూ టీజీ భరత్ బహిరంగంగా స్పష్టంగా చెప్పారు.
జ్యూరిచ్‌లో తెలుగు పారిశ్రామిక వేత్తలతో జరిగిన సమావేశంలో టీజీ భరత్ మాట్లాడుతూ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం సురక్షిత హస్తాల్లో ఉందని వ్యాఖ్యానించారు. దావోస్ పర్యటనలో చంద్రబాబు, నారా లోకేష్, రామ్మోహన్ నాయుడుతో కలిసి పాల్గొన్న టీజీ భరత్, రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడంలో చంద్రబాబు బ్రాండ్ కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు.
జగన్ పై విమర్శలు చేస్తూ, “సొంత తల్లి, చెల్లికి న్యాయం చేయలేని వాడు ప్రజలకు ఏం చేస్తాడు?” అని టీజీ భరత్ విమర్శించారు. టీడీపీ అనేది దీర్ఘకాలిక విజన్ ఉన్న పార్టీ అని, లోకేష్ స్టాన్‌ఫోర్డ్‌లో చదివిన ఉన్నత విద్యావంతుడని, ఆయనలో మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయని భరత్ అభిప్రాయపడ్డారు.
రామ్మోహన్ నాయుడు గురించి మాట్లాడుతూ, “అతను కేంద్ర మంత్రివర్గంలో అతి పిన్న వయస్కుడు. ఏపీ ప్రతీ జిల్లా కేంద్రంలో ఎయిర్ పోర్ట్‌లు రావాలని చంద్రబాబు కలకు అనుగుణంగా రామ్మోహన్