ఏపీలో మెగా డీఎస్సీ షెడ్యూల్‌ విడుదల

ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది యువతకు..సీఎం చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్భంగా కూటమి ప్రభుత్వం గొప్ప కానుక అందించింది. 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ..తమను ఎన్నికల్లో గెలిపిస్తే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని టీడీపీ అధినేత నారా చంద్రబాబు ఏపీ ప్రజలకు మామీ ఇచ్చారు. గెలిచిన అనంతరం మెగా డీఎస్పీ ఫైల్‌పైనే సీఎం చంద్రబాబు తొలి సంతకం కూడా చేశారు. కాగా ఈరోజు చంద్రబాబు 75వ పుట్టినరోజు సందర్భంగా మెగా డీఎస్సీ షెడ్యూల్‌ విడుదల చేసింది.

ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది యువతకు..సీఎం చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్భంగా కూటమి ప్రభుత్వం గొప్ప కానుక అందించింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ 16వేల347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీ షెడ్యూల్‌ను ఈరోజు ప్రకటించారు. ఈ నోటిఫికేషన్‌ ఏపీలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు నిరుద్యోగ యువతకు విశేష అవకాశాలను కల్పించనుండటంతో అక్కడిప్రజల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఏప్రిల్‌ 20, 2025న మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా వివిధ కేటగిరీలలో 16వేల347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ ప్రక్రియ ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను తీర్చడంతో పాటు విద్యా నాణ్యతను కూడా మెరుగుపరచడానికి దోహదపడనుంది. అభ్యర్థులు ఏప్రిల్‌ 20 నుంచి మే 15, 2025 వరకు డీఎస్సీ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ సులభతరం చేయడానికి అధికారిక వెబ్‌సైట్‌లో సమగ్ర సమాచారాన్ని అందుబాటులో ఉంచనుంది కూటమి ప్రభుత్వం.

మెగా డీఎస్సీ రాష్ట్ర విద్యా వ్యవస్థలో కీలక మార్పులకు నాంది పలుకుతుందని నారా లోకేష్ అన్నారు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ఈ నోటిఫికేషన్‌ జారీ చేశామని, ఇది ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి గొప్ప అవకాశమని అన్నారు. అలాగే, విద్యా రంగంలో సంస్కరణలు, ఆధునిక సాంకేతికత వినియోగం, ఉపాధ్యాయుల శిక్షణపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దష్టి సారిస్తోందని మంత్రి లోకేష్ వెల్లడించారు.

కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ విధానంలో జూన్‌ 6 నుంచి జులై 6, 2025 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించబడతాయి. పరీక్షలు పారదర్శకంగా, సమర్థవంతంగా జరిగేలా చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. డీఎస్సీ నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతలను అభ్యర్థులంతా తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలి. సాధారణంగా, బీఎడ్, డీఎడ్‌ వంటి విద్యా అర్హతలతో పాటు టెట్‌ అంటే టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌లో ఉత్తీర్ణత అవసరం.కంప్యూటర్ బేస్ట్ విధానంలో పరీక్ష నిర్వహించబడుతుండటం వల్ల అభ్యర్థులు ఆన్‌లైన్‌ టెస్ట్‌ ఫార్మాట్‌లో అనుభవం పొందాలి.