ఏపీ పోలీస్‌ కానిస్టేబుల్‌ ఫలితాలు విడుదల

Andhra Pradesh Police Constable Mains Results, AP Latest News Updates, AP Police Constable Mains Result 2019 Declared, AP Police Constable Mains Result 2019 Declared Today, AP Police Constable Mains Results, AP Police Constable Mains Results 2019, AP Police Constable Mains Results Out, AP Police Constable Mains Results Released, Mango News Telugu

ఈ రోజు క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి తో హోం మంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి సమక్షంలో హోం మంత్రి సుచరిత ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్‌ నియామక ఫలితాలను విడుదల చేసారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఛైర్మన్ కుమార్ విశ్వజిత్ కూడ హాజరయ్యారు. సివిల్, ఏపీఎస్పీ, ఆర్ముడ్ రిజర్వ్, ఫైర్ మరియు జైలు వార్డు విభాగాల్లో మొత్తం 2723 పోస్టులకు గాను 2623 మంది ఎంపిక అయినట్టు తెలిపారు. ఈ నియామకాల్లో 500 మంది మహిళలు ఎంపిక అయ్యారని చెప్పారు. కొన్ని సామాజిక వర్గాల్లో అభ్యర్థులు లేకపోవడంతో 100 పోస్టులు మిగిలిపోయాయని పేర్కొన్నారు.

ఎంపికైన అభ్యర్థుల జాబితాను http:/slprb.ap.gov.in వెబ్ సైట్ లో ఉంచామని, ఎంపికైన అభ్యర్థులకు త్వరలోనే సర్టిఫికెట్స్ వెరిఫికేషన్, మెడికల్ టెస్టులు నిర్వహిస్తామని పోలీస్ శాఖ అధికారులు తెలియజేసారు. ముందుగా హోం మంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ లతో సమావేశమైన ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంపై వారితో చర్చించారు. బుధవారం నాడు చలో ఆత్మకూరు కార్యక్రమ నేపథ్యంలో జరిగిన పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తుంది.

 

[subscribe]
[youtube_video videoid=3g-pPP3Mcu0]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − 4 =