ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఈఏపీ సెట్-2021 (ఎంసెట్) ను ఇటీవలే నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ఈఏపీసెట్-2021 ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ బుధవారం ఉదయం విజయవాడలో ఈఏపీ సెట్ ఇంజనీరింగ్ కు సంబంధించిన ఫలితాలను విడుదల చేశారు. ఇంజనీరింగ్ (ఎంపీసీ స్ట్రీమ్)కు 1,76,603 మంది దరఖాస్తు చేయగా 1,66,460 మంది హాజరయ్యారని, అందులో 1,34,205 (80.62 శాతం) మంది విద్యార్థులు అర్హత సాధించారని తెలిపారు.
గత సంవత్సరం కంటే 1000 మంది విద్యార్థులు ఎక్కువగానే అర్హత సాధించినట్టు చెప్పారు. విద్యార్థులు రేపటి నుంచి ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. మరోవైపు ఇంజనీరింగ్ విభాగంలో అనంతపురం జిల్లాకు చెందిన నిఖిల్ కు మొదటి ర్యాంకు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన మహంత నాయుడుకు 2వ ర్యాంకు సాధించినట్టు పేర్కొన్నారు. ఇక అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్ష ఫలితాలను సెప్టెంబర్ 14న ప్రకటిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ