ఆరు రకాల రబీ పంటలపై కనీస మద్దతు ధర పెంచిన కేంద్ర ప్రభుత్వం

Cabinet approves increase in MSP for Rabi crops, Cabinet Increases Minimum Support Prices for Rabi Crops, Govt announces MSP of rabi crops, Govt hikes minimum support price, Govt hikes wheat MSP by 2% for 2021-22, Mango News, Marketing Season 2022-23, MSP for Rabi crops for marketing season 2022-23, MSP for Rabi crops hiked, Union Cabinet authorizes increase in minimum support price, Union Cabinet Clears Hike In Minimum Support Price, Union Cabinet Increases Minimum Support Prices for Rabi Crops, Union Cabinet Increases Minimum Support Prices for Rabi Crops for Marketing Season, Union Cabinet Increases Minimum Support Prices for Rabi Crops for Marketing Season 2022-23

దేశవ్యాప్తంగా 2022-23 మార్కెట్ సీజన్‌లో ఆరు రకాల రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బుధవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రిమండలి ఆర్థిక వ్యవహారాల కమిటీ (సీసీఈఏ) సమావేశమై పంటల మద్దతు ధర పెంపుకు ఆమోదం తెలిపింది. రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం ప్రభుత్వం రబీ మార్కెటింగ్ సీజన్ 2022-23లో కనీస మద్ధతు ధరను పెంచినట్టు పేర్కొన్నారు.

కనీస మద్దతు ధర పెరిగిన పంటలివే:

  1. గోధుమలపై కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.40 పెంపు – ధర రూ.2015 గా నిర్ణయం
  2. బార్లీపై రూ.35 పెంపు – ధర రూ.1635 (క్వింటాల్‌కు)
  3. రేప్‌సీడ్స్ అండ్ ఆవాలుపై రూ.400 పెంపు – ధర రూ.5050
  4. మసూర్(లెంటిల్) పప్పుపై రూ.400 పెంపు – ధర రూ.5500
  5. కుసుమలపై రూ.114 పెంపు – ధర రూ.5441
  6. గ్రామ్/శనగలపై రూ.130 పెంపు – ధర రూ.5230
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + 6 =