ఆగస్ట్ నెలలో దుర్గగుడి ఫ్లైఓవర్‌ని ప్రారంభిస్తాం – మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

Durga Gudi Flyover, Durga Gudi Flyover will be Opened in August, Kanaka Durga flyover, Kanaka Durga flyover opening, Kanakadurga Flyover, Kanakadurga Flyover Project Works, Minister Vellampalli Srinivas, Vellampalli Srinivas, Vijayawada Kanakadurga Flyover

విజయవాడలో దుర్గగుడి ఫ్లైఓవర్‌ని ఆగస్ట్ నెలలో ప్రారంభిస్తామని రాష్ట్ర దేవాదయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. జూలై 17, శుక్రవారం నాడు విజయవాడ మున్సిపల్‌ కమిషనర్‌ తో కలిసి దుర్గగుడి ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఫ్లైఓవర్ పనులు ఇప్పటికే 97 శాతం మేరకు పూర్తయ్యాయని, ఆగస్టు నెలలో ప్రారంభిస్తామని చెప్పారు. చంద్రబాబు గత పుష్కరాలప్పటికే ఫ్లైఓవర్ పూర్తి చేస్తాం అని చెప్పి మాట తప్పారు. విజయవాడ అభివృద్ధిని సైతం పూర్తిగా వదిలేశారని మంత్రి విమర్శించారు. అలాగే పార్లమెంట్‌ సభ్యుడిగా ఐదేళ్లలో కేశినాని నాని విజయవాడకు చేసిందేమి లేదని మంత్రి అన్నారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో ప్రజాధనాన్ని దోచుకున్నవారిని చట్టం వదలదని, తప్పులు చేసిన వారు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY