
ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల కోసం.. ఎన్డీయే కూటమి కేండిడేట్స్‌ను ఖరారు చేసింది. తెలుగు దేశం పార్టీ నేత సి.రామచంద్రయ్య, జనసేన పార్టీ అధ్యక్షుల వారి రాజకీయ కార్యదర్శి పిడుగు హరి ప్రసాద్ పేర్లను ఖరారు చేసింది. దీంతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరపున ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సి.రామచంద్రయ్య, పిడుగు హరి ప్రసాద్ జులై 2న నామినేషన్ దాఖలు చేయబోతున్నారు.
కాగా తెలుగు దేశం పార్టీలో సుదీర్ఘ కాలం కొనసాగిన సి.రామచంద్రయ్య .. మంత్రిగా,ఎంపీగా పొలిట్ బ్యూరో సభ్యుడిగానూ పని చేశారు. ఆ తర్వాత చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో కూడా పని చేశారు. 2018లో వైఎస్సార్సీపీలో చేరి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2023 డిసెంబర్ వైఎస్సార్సీపీకి గుడ్ బై చెప్పి చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. ఇటు పిడుగు హరి ప్రసాద్ చాలా కాలంగా జర్నలిస్టుగా పని చేశారు. ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఆలోచనలు, వ్యక్తిత్వం నచ్చిన హరిప్రసాద్..పవన్ ఒక కొత్త పార్టీ పెట్టడంతో ఆయన సలహాదారుడిగా నియమితులయ్యారు. అప్పటి నుంచి జనసేన పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ కోసం పని చేస్తున్నారు.
ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో పాటు జనసేన పార్టీ హండ్రెడ్ పర్సంట్ స్ట్రైక్ రేటుతో 21కి 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలు గెలవడంతో చంద్రబాబు జనసేనకు అన్ని విషయాల్లోనూ పెద్ద పీట వేస్తున్నారు. తాజాగా ఇలాగే జనసేన పార్టీ తరపున ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ బరిలో పి. హరిప్రసాద్ నిలిచే అవకాశం దక్కింది. ఇలా కూటమి తరపున ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సి. రామచంద్రయ్య, పిడుగు హరి ప్రసాద్ మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY