
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. మూడోసారి భారతదేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నరేంద్ర మోదీ ఏపీ పర్యటనకు తొలిసారి రానుండటం ప్రత్యేకతను సంతరించుకుంది. జూన్ 12న ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనుండటంతో..ప్రత్యేక ఆహ్వానంతో చంద్రబాబు ప్రమాణం కార్యక్రమానికి ప్రధాని మోదీ విచ్చేయబోతున్నారు.
బుధవారం అంటే జూన్ 12న విజయవాడ కేసరపల్లి ఐటీ పార్కు వద్ద చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధాని మోదీ బుధవారం ఉదయం 8.20 గంటలకు హస్తిన నుంచి బయల్దేరి.. ఉదయం 10.40 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. ఎయిర్ పోర్ట్ నుంచి తిన్నగా చంద్రబాబు ప్రమాణ స్వీకార ప్రాంగణానికి 11 గంటలకు చేరుకుంటారు.
ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12.45 గంటలకు..మరో ప్రత్యేక విమానంలో ఒడిశాలోని భువనేశ్వర్ పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నట్లు అధికారులు చెబుతున్నారు.నిజానికి ఈ నెల 9న చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం నిర్ణయించగా అదే రోజు ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండటంతో దానిని వాయిదా వేసుకుని జూన్ 12న ఏర్పాటు చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జూన్ 12న ఉదయం 11.27 గంటలకు జరగనున్న చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, కొంతమంది ప్రముఖులు హాజరు కాబోతున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దగ్గర ఉండి ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే అతిథుల కోసం విజయవాడలోని పెద్దపెద్ద హోటళ్లలో గదులను బుక్ చేశారు. దాదాపు 10 వేల మంది పోలీసులను ఈ కార్యక్రమ బందోబస్తు కోసం వినియోగిస్తున్నారు. చంద్రబాబు నివాసం ఉంటున్న ఉండవల్లి నుంచి గన్నవరంలోని వేదిక వరకూ అన్ని రకాలుగా పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవిజయవాడలో స్థానిక పోలీసులతో కలిసి స్పీజీ బృందం భద్రతను సమన్వయం చేసుకుని సెక్యూరిటీని పటిష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE