భారత్‌లో ఈ వ్యాక్సిన్ ప్రభావం ఎంత?

Covishield vaccine dangerous?,effective is this vaccine, vaccine in India,Covishield vaccine
Covishield vaccine dangerous?,effective is this vaccine, vaccine in India,Covishield vaccine

కొవీషీల్డ్ వ్యాక్సిన్..ఎన్నో మరణాలకు కారణమైందన్న ఆరోపణలపై క్లాస్ యాక్షన్ దావాను ఆస్ట్రాజెనెకా ఇప్పుడు ఎదుర్కొంటోంది. కొవిషీల్డ్ చాలా రేర్ సందర్భాల్లో, టీటీఎస్ ప్రభావానికి కారణమవుతుందని ఆస్ట్రాజెనెకా డ్రగ్ తయారీ సంస్థ చెబుతోంది. టీటీఎస్  అంటే థ్రోంబోసిస్ విత్ థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ అనేది  రక్తం గడ్డకట్టడానికి, మానవులలో తక్కువ రక్త ప్లేట్‌లెట్ కౌంట్‌కు కారణమవుతుంది.

2022లో ఈ వ్యాక్సిన్ వల్ల తీవ్రమైన హాని కలగడంతో పాటు మరణాలు సంభవించాయన్న ఆరోపణలపై దావాను ఎదుర్కొంటున్న కంపెనీ, టీటీఎస్ సైడ్ ఎఫెక్ట్‌ను కంపెనీ కోర్టులో అంగీకరించడంతో అందరిలో భయం మొదలయింది. అయితే దీనివల్ల భారత్‌‌కు ప్రమాదం లేదన్న వాదన వినిపిస్తోంది.

టీటీఎస్ చాలా అరుదైన దుష్ప్రభావం చూపిస్తుందని.. యూరోపియన్లతో పోలిస్తే భారతీయులు, దక్షిణ ఆసియన్లలో దీని ప్రభావం  చాలా అరుదు. వ్యాక్సిన్ వల్ల అప్పుడు కలిగిన ప్రయోజనాలే ఎక్కువ. దీనికి తోడు చాలా మంది భారతీయులు మూడు టీకాలు తీసుకొని చాలా కాలం అవడంతో… ప్రమాదమేమి లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ భద్రతా సలహా కమిటీలో ఉన్న బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌లో పని చేస్తున్న గ్లోబల్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గగన్‌దీప్ కాంగ్ అంటున్నారు.

ఈ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఇంజెక్షన్ వేసిన చోట అసౌకర్యంగా ఉంటుంది. సాధారణంగా ఈ టీకా తీసుకున్న తర్వాత అస్వస్థత, అలసట, జ్వరం, తలనొప్పి, కీళ్లు లేదా కండరాల నొప్పి, వాపు,ఇంజెక్షన్ చేసిన ప్రాంతం  ఎరుపెక్కడం, మైకం, నిద్రపోవడం, చెమట, కడుపు నొప్పి, మూర్ఛ వంటివి కనిపిస్తాయి. కానీ ఇవన్నీ అప్పుడే కనిపిస్తాయి.

కొద్ది సేపటి తర్వాత తగ్గిపోతాయి కూడా అయితే టీకాలలో ఉపయోగించే అడెనోవైరస్ వెక్టర్ ద్వారా ప్రేరేపించబడిన రోగనిరోధక ప్రతిస్పందన వల్ల ఏర్పడే  టీటీఎస్ వల్ల ప్లేట్‌లెట్‌లను సక్రియం చేస్తుంది, రక్తం గడ్డలను ఏర్పడేలా చేస్తుంది. అయితే ఇంజక్సన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు దీని వల్ల ప్రజలు ఇప్పుడు స్పందించడం ఆశ్చర్యంగా ఉందని గ్లోబల్ హెల్త్ డైరెక్టర్ అంటున్నారు. ప్రస్తుతం చాలా మందిలో ఇమ్యునైజేషన్ అవసరం లేదని చెబుతున్నారు. ప్రస్తుతం భారతీయ జనాభాలో యాంటీబాడీ స్థాయిలు చాలా ఎక్కువగా ఉండటం వల్ల.. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని అంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 4 =