గత నెల 27న అస్వస్థతకు లోనైన సినీ నటుడు నందమూరి తారకరత్న తదనంతర పరిస్థితుల్లో బెంగళూరు హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే వారం రోజుల నుంచి చికిత్స పొందుతున్నా ఆయన ఆరోగ్యం మెరుగు పడుతున్న సూచనలు మాత్రం అంతగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో మెరుగైన వైద్యం కోసం తారకరత్నను కుటుంబ సభ్యులు విదేశాలకు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు టీడీపీ సీనియర్ నేత అంబికా లక్ష్మీ నారాయణ తెలిపారు. శుక్రవారం ఆయన బెంగళూరు ఆస్పత్రిలో నందమూరి తారకరత్నను పరామర్శించారు. ఐసీయూలో ఉన్న తారకరత్న పరిస్థితిపై కుటుంబ సభ్యులు, వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
అనంతరం బయట మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు తారకరత్న మెదడుకు స్కానింగ్ తీశారని, వచ్చిన రిపోర్టును బట్టి ఆయన మెదడు పనితీరుపై వైద్యులు ఒక అంచనాకు వస్తారని తెలిపారు. ఇక పరిస్థితిని బట్టి, వైద్యుల సూచనల మేరకు తారకరత్నను విదేశాలకు తరలించేందుకు కుటుంబ సభ్యులు ఆలోచన చేస్తున్నారని వెల్లడించారు. కాగా నందమూరి బాలకృష్ణ దగ్గరుండి తారకరత్నను చూసుకుంటున్నారని, ఆయనతో పాటు తారకరత్న తండ్రి మోహనకృష్ణ, భార్య అలేఖ్య తదితరులు ఆస్పత్రిలోనే ఉన్నారని లక్ష్మీ నారాయణ తెలియజేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేతృత్వంలో కుప్పంలో ప్రారంభమైన యువగళం పాదయాత్రలో పాల్గొన్న సందర్భంగా తారకరత్న ఒక్కసారిగా కుప్పకూలిన సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE