ఒంగోలులో ఈరోజు ప్రారంభమైన మహానాడు కార్యక్రమంలో టీడీపీ నేతలు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఉదయం సభలో ప్రసంగిస్తూ.. పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వచ్చే ఎన్నికల్లో యువతకు 40% సీట్లు ఇస్తామని ప్రకటించి పార్టీ కేడర్ లో ఉత్సాహం నింపారు. అనంతరం కార్యక్రమంలో భాగంగా టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ మరో సంచలనం నిర్ణయం తీసుకున్నారు. పార్టీ జాతీయ కార్యదర్శి పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. పార్టీ పదవుల్లో ఇకపై 2+1 పద్దతి అమలు చేయాలని నిర్ణయించుకున్నామని, దీని ప్రకారం ఎవరైనా రెండు సార్లు వరుసగా ఒకే పదవి చేపడితే ఆ తర్వాత ఒకసారి ఆ పదవి నుంచి తప్పుకోవాలన్నారు.
ఇందుకోసం మొదటగా తానే తన పదవి నుంచి స్వచ్చందంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించడం విశేషం. ఇప్పటికే ఈ పదవిని మూడు సార్లు చేపట్టానని, ఈసారి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని భావించానని పేర్కొన్నారు. అలాగే ఎవరైనా వరుసగా మూడుసార్లు ఓడితే ఇకపై వారికి టికెట్ ఇవ్వమని తెలిపారు. పని చేయని నేతలకు, ఇన్‌చార్జ్‌లకు అవకాశాలుండవని, వారు పనిచేసి తమ సామర్ధ్యాన్ని నిరూపంచుకోవాల్సిందేనని లోకేష్ తేల్చిచెప్పారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన వెంటనే అభ్యర్థులను ప్రకటిస్తామని, దాదాపు 30 స్థానాల్లో సరైన అభ్యర్థులను పార్టీ నియమించాల్సి ఉందని వెల్లడించారు. కాగా మహానాడుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ



































