వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నో ఇబ్బందులు.. ఎన్నో అవమానాలు.. మరెన్నో పరిస్థితులను అధిగమించి ఎట్టకేలకు ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మేలో జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించింది. వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించి అధికార పీఠాన్ని అధిరోహించింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. పదువులు కట్టబెట్టే విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇకపోతే అయిదేళ్లు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కచ్చితంగా వచ్చేది తమ ప్రభుత్వంమేనని.. తమకు తగిన న్యాయం జరుగుతుందని ఇన్నేళ్లు ఎదురు చూశారు.
ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కూటమి గెలుపు కోసం పని చేసిన తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు, బీజేపీ కార్యకర్తలంతా నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెట్టుకున్నారు. అయితే ఎవరెవరికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలనే దానిపై కూటమి పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఒక ఫార్ములాను అమలు చేసి.. దాని ఆధారంగా నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని కూటమి పెద్దలు నిర్ణయించారట. నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో ప్రతి ఒక్కరూ ఆ ఫార్ములూను ఫాలో అవ్వాల్సిందేనని తేల్చారట.
తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట 60 శాతం నామినేటెడ్ పోస్టులు ఆ పార్టీ కార్యకర్తలు.. మిగిలిన 40లో 30 శాతం పోస్టులు జనసేన కార్యకర్తలకు, 10 శాతం పోస్టులు బీజేపీ కార్యకర్తలకు దక్కేలా కూటమి పెద్దలు నిర్ణయించారట. అలాగే జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట 60 శాతం నామినేటెడ్ పోస్టులు ఆ పార్టీ కార్యకర్తలకు.. 30 శాతం టీడీపీ కార్యకర్తలకు, 10 శాతం జనసేన కార్యకర్తలకు కట్టబెట్టనున్నారట. అదే సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో 50 శాతం పోస్టులు బీజేపీ కార్యకర్తలకు.. మిగిలిన 50 శాతంలో 25 శాతం పోస్టులు టీడీపీ కార్యకర్తలకు, 25 శాతం పోస్టులు జనసేన కార్యకర్తలకు ఇచ్చేలా కూటమి పెద్దు నిర్ణయించారట. ఇదే విషయాన్ని ఇటీవల జనసేన కీలక నేత నాగబాబు పార్టీ కార్యకర్తలతో చెప్పారట. పార్టీ కోసం పదేళ్లుగా కష్టపడుతున్నవారికి తగిన ఫలితం దక్కేలా చూస్తామని హామీ ఇచ్చారట.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY