ఏప్రిల్ 12న మార్కాపురం పర్యటనకు సీఎం జగన్.. ఈబీసీ నేస్తం రెండో విడత నిధులు విడుదల

CM YS Jagan To Release The Second Tranche of EBC Nestham Funds on April 12 at Markapuram,CM YS Jagan To Release EBC Nestham Funds,EBC Nestham Funds,EBC Nestham,Mango News,Mango News Telugu,EBC Nestham Funds on April 12,CM YS Jagan Markapuram Visit,YS Jagan Markapuram Visit,AP Cm YS Jagan Mohan Reddy,YS Jagan Mohan Reddy Latest News and Updates,Jagan Markapuram Visit

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఏప్రిల్‌ 12న మార్కాపురంలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన ‘వైఎస్సార్ ఈబీసీ నేస్తం’ పథకం రెండో విడత నిధులు విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, జిల్లా యంత్రాంగం, పోలీసు అధికారులతో ఇప్పటికే సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌కుమార్‌, ఎస్పీ మలికా గర్గ్‌, స్థానిక ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు జంకె వెంకట రెడ్డి, ముఖ్యమంత్రి పర్యటన సమన్వయకర్త, ఎమ్మెల్సీ తలశిల రఘురాం తదితరులు జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలోని హెలిప్యాడ్ స్థలాన్న మరియు బహిరంగ సభ జరుగనున్న వాసవీ కన్యకాపరమేశ్వరి ప్రాంగణాన్ని పరిశీలించారు. అలాగే ప్రజల నుంచి సీఎం జగన్ అర్జీలు స్వీకరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

ఇక వేసవి నేపథ్యంలో.. బహిరంగ సభకు హాజరయ్యే ప్రజలకు అల్పాహారం, తాగునీరు, మజ్జిగ అందించడంపై దృష్టి సారించాలని కోరారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా భద్రత, ట్రాఫిక్ నియంత్రణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాలైన బ్రాహ్మణ, క్షత్రియ, కమ్మ, వైశ్య, వెలమ మరియు రెడ్డి వంటి కులాల మహిళలకు సహాయం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘వైఎస్సార్ ఈబీసీ నేస్తం’ నేస్తం అనే కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద రూ. 45-60 సంవత్సరాల వయస్సు గల మహిళా లబ్ధిదారులకు సంవత్సరానికి రూ.15,000 చొప్పున మూడేళ్లలో మొత్తం రూ. 45,000 ఆర్థిక సాయం అందిస్తారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,92,674 మంది లబ్ధిదారులు ఈ పథకం ద్వారా లబ్ధి పొండుతుండగా.. దీనికోసం ప్రభుత్వం రూ.670 కోట్లు కేటాయించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 4 =