ఏపీ ఈఏపీ సెట్-2021 : అగ్రికల్చర్‌, ఫార్మసీ ఫలితాలు విడుదల

Agriculture and Pharmacy Results Released, Agriculture and Pharmacy Results Released Today, AP EAMCET 2021 Agriculture pharmacy result, AP EAMCET 2021 Agriculture result, AP EAMCET 2021 Pharmacy result, AP EAMCET 2021 Result, AP EAP CET-2021, AP EAPCET, AP EAPCET Result 2021, AP EAPCET Result 2021 for Agriculture stream out, AP EAPCET results, AP EAPCET results 2021, AP EAPCET Results 2021 released, Mango News

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఈఏపీ సెట్-2021 (ఎంసెట్) ను ఇటీవలే నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ఈఏపీసెట్‌-2021 ఇంజనీరింగ్‌ (ఎంపీసీ స్ట్రీమ్‌) ఫలితాలు సెప్టెంబర్ 9 విడుదల కాగా, అగ్రికల్చర్‌, ఫార్మసీ (బైపీసీ స్ట్రీమ్‌) పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మంగళగిరిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఈఏపీ సెట్ అగ్రికల్చర్‌, ఫార్మసీకు సంబంధించిన ఫలితాలను విడుదల చేశారు.

అగ్రికల్చర్‌, ఫార్మసీ (బైపీసీ స్ట్రీమ్‌) కు 83,822 మంది దరఖాస్తు చేయగా 78,066 మంది హాజరయ్యారని, అందులో 72,488 (92.85 శాతం) మంది విద్యార్థులు అర్హత సాధించారని తెలిపారు. మరోవైపు అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగంలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన చందం విష్ణు వివేక్ మొదటి ర్యాంకు, అనంతపూర్ జిల్లాకు చెందిన రంగు శ్రీనివాస కార్తికేయ 2వ ర్యాంకు, హనుమకొండకు చెందిన బొల్లినేని విశ్వాస్ రావు మూడో ర్యాంకు సాధించినట్టు పేర్కొన్నారు

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × three =