మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి మధ్య అన్నీ సరిగ్గా లేవని ఈ మధ్య తరచు రూమర్లు వస్తున్నాయి. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలో నిలిచినప్పుడు తన ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీ అభ్యర్థికి కోసం అల్లు అర్జున్ చేశారు. అక్కడి నుంచి రెండు కుటుంబాల మధ్య సంబంధాలు జఠిలమయ్యాయని అభిమానులు భావిస్తున్నారు. ఎన్నికల్లో గెలిచిన పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, అటవీ శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రేతో మీడియా చర్చలో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్. అయితే ఎప్పుడు పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలోని కొన్ని మాటలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యాయి.
గత కొన్నెల్లుగా సాంస్కృతికంగా వస్తున్న మార్పులను, కొన్నేళ్లుగా హీరోల చిత్రణను వివరించారు. 40 ఏళ్ల క్రితం హీరోలు అడవులను కాపాడేవారని, ఇప్పుడు సినిమాల్లో చెట్లను నరికి అక్రమ రవాణా చేస్తున్నారని అన్నారు. కన్నడ నటుడు రాజ్‌కుమార్ నటించిన గంధడ గుడి చిత్రంలో అడవుల సంరక్షణ గురించి మాట్లాడారని పవన్ అన్నారు. స్మగ్లర్ల నుంచి అడవిని కాపాడే ఫారెస్ట్ ఆఫీసర్ కథే ఈ సినిమా అని తెలిపారు. సంస్కృతి ఎలా మారిందో నేను ఇటీవల నా అధికారులతో పంచుకున్నాను. నలభై ఏళ్ల క్రితం అడవులను కాపాడే వాడు వీరుడు. ఇప్పుడు అడవులను నరికి భూమిని నాశనం చేసే వాడిని హీరో అంటున్నారు అని పవన్ అన్నారు. తాను కూడా సినిమా ఫీల్డ్‌లో భాగమేనని, ఇలాంటి సినిమాలు తీయడానికి తరచూ కష్టపడుతున్నానని, ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారని పవన్ ప్రశ్నించారు.
పుష్ప సినిమాలో అల్లు అర్జున్ గంధపు చెక్కల స్మగ్లర్ పాత్రను పోషించిన విషయం తెలిసిందే. కాగా పవన్ కళ్యాణ్ కావాలనే అల్లు అర్జున్ ను టార్గెట్ చేస్తూ కాంమెంట్స్ చేశారని అల్లు అర్జున్ అభిమానులు అనుకుంటున్నారు. కాగా పవన్ కామెంట్స్ పై మంత్రి నాదేండ్ల మనోహర్ స్పందించారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించరు. పర్యావరణాన్ని కాపాడాలి, మొక్కలు పెంచాలనే ప్రత్యేక కార్యాచరణతోనే అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకుంటున్నారు అంతే తప్ప ఓ హీరోపై పరోక్షంగా కామెంట్స్ చేసారని ప్రచారం చేయడం తప్పు..కావాలని కొంతమంది పవన్ వ్యాఖ్యలపై తప్పుగా ప్రచారం చేస్తున్నారని మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేసారు.