మరో 50 మంది వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మొండి చెయ్యి?

No ticket for Roja in the next election,No ticket for Roja,Roja in the next election,YCP, AP Politics,Andhra Pradesh, SrinivasReddy, Perni Nani,YCP,YS Jagan,Congress,Alla Ramakrishnareddy,Devan Reddy,Roja, Suresh,Mango News,Mango News Telugu,No ticket for RK Roja,CM Jagan Given Big Shock,YS Jagan has decided,AP Politics,AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates
YCP, AP Politics,Andhra Pradesh, SrinivasReddy, Perni Nani,YCP,YS Jagan,Congress,Alla Ramakrishnareddy,Devan Reddy,Roja, Suresh

ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఎన్నికలకు ఎక్కువ  సమయం లేకపోవడంతో.. అధికార పార్టీ ఇప్పటి నుంచే రాజకీయ వ్యూహాలు రచిస్తోంది. రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి సీఎం జగన్..పార్టీలో ఎంతటి పెద్ద నేత అయినా సరే ప్రజల్లో వ్యతిరేకత ఉందని సర్వేలు చెబితే నిర్దాక్షణ్యంగా వారిని పక్కన పెట్టేయడానికి నిర్ణయం తీసేసుకున్నారట.  అంతే కాదు 150మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 50మందికి ఈ సారి నో టికెట్ అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారట.

ఆంధ్రప్రదేశ్లో మరో 4 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఏకంగా 50 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చడం వెనుక ఎం వైఎస్ జగన్ వ్యూహం ఏమిటనే చర్చ జరుగుతోంది. తెలంగాణలో బీఆర్ఎస్ వ్యతిరేకత ఉన్నా కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చి చేతులు కాల్చుకోవడంతో.. ఇప్పుడు ఇదే తప్పు తాను చేయకుండా సీఎం జగన్ జాగ్రత్త పడుతున్నారని తెలుస్తోంది.

కేసీఆర్‌లా  ఎన్నికల సమయంలో నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేపడితే తమ పార్టీకీ కూడా  ప్రమాదమని భావించిన జగన్.. ఇప్పటి నుంచే గెలిచే అవకాశం తక్కువగా ఉన్న నియోజకవర్గాల్లోని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు  ఈసారి ఎట్టిపరిస్థితులలోనూ టికెట్ ఇవ్వకుండా కొత్తవారిని మాత్రమే నిలబెట్టాలని చూస్తున్నారు . ప్రస్తుతం 151 మంది వైసీపీ ఎమ్మెల్యేల్లో ఒకరు పార్టీ మారగా..మిగిలిన 150మందిలో 50మంది సిట్టింగులకు నో టికెట్ అని  జగన్ తేల్చి చెప్పేశారట. అంతేకాకుండా అందులో 42మంది ఎమ్మెల్యేలకు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కాకుండా.. వారి స్థానాన్ని మార్చాలని మార్చాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది.

జగన్ తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాలతోనే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, గాజువాక ఇన్చార్జ్ దేవన్ రెడ్డి తమ పదవులకు రాజీనామా చేసినట్లు వార్తలు వస్తున్నాయి. వీళ్లే కాదు..ఈ సారి సీఎం జగన్ టికెట్ ఇవ్వని వారి జాబితాలో మంత్రులతో పాటు.. మాజీ మంత్రులు కూడా ఉన్నారట. ముఖ్యంగా పార్టీలోనూ, ప్రాంతీయంగానూ బీభత్సమైన నెగిటివిటీని మూట గట్టుకున్న  పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజాను కూడా జగన్ పక్కన పెట్టేస్తున్నారట. అంతేకాకుండా మాజీ మంత్రులు ఆదిమూలపు సురేష్, పేర్నినాని, బాలినేని శ్రీనివాస్ రెడ్డికి  ఈ ఎన్నికలలో టికెట్ దక్కడం లేదని తెలుస్తోంది.

దీంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఏపీ రాజకీయాలపై ప్రత్యక్ష ప్రభావం చూపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నికల హామీలు చాలావరకూ నెరవేర్చాం, ఉచిత పథకాలకు ప్రజలను అలవాటు చేసేశాం.. ఇక ఏపీ ప్రజలు మళ్లీ వైసీపనే గెలిపిస్తారని  ధీమాతె ఉన్న  జగన్.. తెలంగాణ ఫలితాలతో తన మైండ్ సెట్ మార్చుకున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలో వలే ఏపీలో కూడా వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేకపోయినా..పార్టీ తరపున గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలపై ప్రజావ్యతిరేకత ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. అలాంటి రిపోర్టులను లైట్ తీసుకుని సిట్టింగులకే సీట్లు ఇవ్వడం వల్ల కేసీఆర్ ఓటమిపాలయ్యారు. దీంతో అలాంటి తప్పే తాను చేయకూడదని  అలాంటి వాళ్ల వల్ల పార్టీకి చేటు కలగకుండా.. ఎన్నికలకు ముందే ప్రక్షాళన మొదలుపెట్టేస్తున్నారట.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + 8 =