ఏపీలో ఎన్నడూ లేనంతగా ఓటు ఉత్సాహం వెల్లి విరిసింది. గతంలో లేని విధంగా 82% ఓటింగ్ నమోదు అవడంతో రాజకీయ నాయకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వచ్చిన వెంటనే దేశవిదేశాల్లో ఉంటున్న తెలుగువారంతా ఓటు వేయడానికి నిర్ణయం తీసుకున్నారు. అందుకే ఈ సారి ఎన్నికలకు ఎన్ఆర్ఐలు భారీగా వచ్చి తమతమ ఓట్లను తమకు నచ్చిన అభ్యర్దులకు వేసి వారి అభిమానాన్ని చాటుకున్నారు.
ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో ఓటు వేయడానికి వివిధ ప్రాంతాల నుంచే కాకుండా విదేశాల నుంచీ కూడా ప్రజలు స్వచ్ఛందంగా రావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా పిఠాపురంలో పవన్ ఫ్యాక్టర్ బాగా పనిచేసిందనే చెప్పొచ్చు. కేవలం పవన్ కు ఓటేయడానికి విదేశాల నుంచి ఆయన అభిమానులు ఓటు వేయడానికి భారీగా తరలిరావడం చూసి అధికారపార్టీ నేతలు షాక్ తిన్నట్లు తెలుస్తోంది.
దీనికి తోడు ఎన్నడూ లేనంతగా హైదరాబాదులో ఉన్న సెటిలర్స్ ఏపీకి ఓటేయడానికి వెళ్లారు. దీంతో ఆ రెండు రోజులు సంక్రాంతి సమయంలో ఉన్నట్లుగానే భాగ్యనగరమంతా ఖాళీగా కనిపించింది. ఒక్క హైదరాబాదు నుంచే దాదాపు ఎనిమిది లక్షలు మంది ఓటర్లు ఏపీకి వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అందుకే ఆ సమయంలో హైదరాబాద్- విజయవాడ ప్రధాన రహదారి వాహనాల రాకపోకతలతో రద్దీగా మారింది. హైదరాబాద్‌లో ఈ ప్రాంతం ఆ ప్రాంతం అన్న తేడా లేకుండా.. అన్ని ప్రాంతాల నుంచి ఏపీలోని వివిధ నియోజకవర్గాలలో ఓటేయడానికి స్వస్థలాలకు వచ్చారు.
అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాల్లో ఉండే తెలుగు వారు కూడా డబ్బు ఎంత ఖర్చు అయినా పర్వాలేదన్న భావనతో తమ సొంత నియోజకవర్గంలో ఓటు వేయడానికి వచ్చారు. లక్షలాది రూపాయల విమాన చార్జీలు పెట్టుకొని మరీ వచ్చి ఓటేశారు. పిఠాపురానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రసన్న కుమార్ అనే యువకుడు అమెరికా నుంచి లక్ష అరవై వేల రూపాయలు ఖర్చు చేసి వచ్చి పవన్ కు ఓటేశాడు. మొత్తంగా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పవన్ పోటీ చేస్తుండటాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆయన అభిమానులు పిఠాపురానికి వచ్చి ఓటేయడం టాక్ ఆఫ్ ది ఏపీ అయిపోయింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY