
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంగళగిరిలోని పోలింగ్ కేంద్రానికి వచ్చిన పవన్ కళ్యాణ్..ఓటేశారు. తన భార్యతో కలసి వచ్చిన పవన్.. ఓటుహక్కును వినియోగించుకున్నారు. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేస్తున్న పవన్ కళ్యాణ్‌కు …మంగళగిరిలో ఓటు హక్కుఉండటంతో.. తన భార్య అన్నా లెజ్నెవాతో కలిసి ఓటు వినియోగించుకున్నారు. మంగళగిరి లక్మీనరసింహ స్వామి కాలనీలో పవన్ ఓటు వేశారు.
అయితే పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పోలింగ్ కేంద్రానికి వస్తున్నారని తెలిసిన ఆయన ఫ్యాన్స్, జనసైనికులు ముందుగానే అక్కడకు చేరుకున్నారు. పిఠాపురానికి పవన్, పవన్ సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. అభిమానుల తాకిడితో పవన్‌ను పోలింగ్ కేంద్రంలోకి పంపడానికే పోలీసులకు చుక్కలు కనిపించాయి. క్యూ లైన్లో నిలబడి తన ఓటును వేసిన పవన్ .. ఓటు వేసిన వెంటనే తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి బయలుదేరి వెళ్లిపోయారు.
మరోవైపు పవన్ కళ్యాణ్ తన మూడో భార్యను వదిలేసారంటూ రకరకాలుగా వ్యక్తిగత విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలకు పవన్, లెజ్నెవా రాక సమాధానం చెప్పినట్లయింది. పోతిన మహేశ్ వంటివారు ఛాలెంజ్ చేసి మరీ చేసిన కామెంట్లకు జనసేనాని, తన భార్యతో కలిసి ఓటు వేసి గట్టిగా బుద్ది చెప్పారంటూ జనసైనికులు కౌంటర్లు వేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY