గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల శాఖాపరమైన పరీక్షలకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ

AP Sachivalayam Probation Departmental Test 2021, AP Sachivalayam Probation Departmental Test 2021 Syllabus, APPSC, APPSC Departmental Tests 2021, appsc departmental tests special notification, APPSC Released Exam Notification, APPSC Released Exam Notification for Employees, APPSC Released Exam Notification for Employees of Certain Departments of Ward, Exam Notification for Employees of Certain Departments of Ward Village Secretariats, Mango News, village secretariats

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల యొక్క కొన్ని డిపార్ట్‌మెంట్‌ల ఉద్యోగులకు ప్రొబేషన్ పూర్తవుతున్న నేపథ్యంలో వారికి శాఖాపరమైన పరీక్షలను (స్పెషల్ సెషన్) నిర్వహించేందుకు ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) సిద్ధమైంది. ఈ పరీక్షలకు సంబంధించి ఏపీపీఎస్సీ శుక్రవారం నాడు నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తులను సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు ఆన్‌లైన్‌ ద్వారా స్వీకరించనున్నట్టు తెలిపారు. అలాగే ఫీజు చెల్లింపుకు చివరి తేదీ సెప్టెంబర్ 17 గా నిర్ణయించారు.

ఇక శాఖాపరమైన పరీక్షలను సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు 3 రోజుల పాటుగా నిర్వహించనున్నారు. దరఖాస్తుదారులు ప్రధానంగా ఏపీపీఎస్సీ వెబ్‌సైట్ లో వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ( ఓటీపీఆర్‌) నమోదు చేసుకోవాలని సూచించారు. అలాగే డిపార్ట్‌మెంటల్ టెస్ట్ రూల్స్ 1965 ప్రకారం గరిష్ట మార్కులు 100గా ఉంటాయని, కనీస అర్హత 40 మార్కులు అని ఏపీపీఎస్సీ వెల్లడించింది.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 1 =