ఓడలు బళ్లు అవుతాయి.. బళ్లు ఓడలవుతాయి అనే సామెత అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సామెత జనసేన పార్టీకి పర్ ఫెక్ట్‌గా సరిపోతుంది. 2019 ఎన్నికల్లో జనసేన ఒకే ఒక్క స్థానాన్ని గెలుచుకుంది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రెండు స్థానాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పట్లో కొందరు జనసేనను ఒక ప్రాంతీయ పార్టీలా చూడడానికి ఇష్టపడలేదు. కానీ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా. ఒకప్పుడు ఓడినపార్టీనే ఇప్పుడు ఏపీలో అధికారంలోకి వచ్చింది. రావడమే కాదు కూటమి గెలుపులో కీలక పాత్ర పోషించింది. వంద శాతం స్ట్రైకింగ్ రేట్ సాధించి సంచలనం సృష్టించింది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అధికారం చేతిలో ఉందనే గర్వం లేకుండా.. వ్యూహాత్మకంగా పవన్ ముందుకెళ్తున్నారు.
అయితే ఇన్ని రోజులు ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ఇప్పుడు అధికారం కోల్పోవడంతో.. ఆ పార్టీ నేతలు అయోమయంలో పడిపోయారు. వైసీపీలో ఉండలేక.. అధికార పార్టీలోకి జంప్ అయ్యేందుకు సిద్ధమవుతున్నవారు. మెన్నటి వరకు జనసేన పార్టీ, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన నేతలు ఇప్పుడు జనసేన గూటికి వచ్చేందుకు సిద్ధమవుతున్నారట. పెద్ద ఎత్తున వైసీపీ నేతలు, కార్యకర్తలు, ఇతరులు జనసేనలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నామని ప్రతిపాదనలు పంపిస్తున్నారట. తెర వెనుక మంతనాలు జరుపుతున్నారట. అయితే వైసీపీ నేతలను చేర్చుకునే విషయంలో తొందర పడకూడదని.. కూటమిలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని ఇన్నిరోజులు పవన్ భావించారు.
కానీ తాజాగా వైసీపీ నేతలను పార్టీలో చేర్చుకునేందుకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసుకోవాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. పార్టీ వీక్‌గా ఉన్న ఏరియాల్లో మరింత బలోపేతం చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే పార్టీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్న వైసీపీ నేతలను చేర్చుకునేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారట. అయితే అందుకు కొన్ని కండీషన్లు పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు జనసేనపై విమర్శలు చేయని వారు.. జనసేన కార్యకర్తల్ని ఇబ్బందులకు గురి చేయని వారిని మాత్రమే పార్టీలో చేర్చుకోవాలని జగన్ నిర్ణయించారట. త్వరలోనే వైసీపీ నేతల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి అందులో క్లీన్ ఇమేజ్ ఉన్న వారిని పార్టీలో చేర్చుకునేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారట.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE