జూలై 8,9వ తేదీల్లో సీఎం వైఎస్ జగన్‌ కడప జిల్లా పర్యటన

Andhra CM YS Jagan Mohan Reddy, AP CM To Tour Kadapa District, AP CM YS Jagan, AP CM YS Jagan will Tour in Kadapa District, AP CM YS Jagan will Tour In Kadapa District on July 8, Ap Political News, Jagan to tour Kadapa, Mango News, YS Jagan to tour Kadapa district, YS Jagan Tour in Kadapa District, YSR

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి జూన్ 8, 9వ తేదీల్లో వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా 9వ తేదీన బద్వేలు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. బద్వేలు మున్సిపాలిటీతో పాటు నియోజకవర్గపరిధిలో సుమారు రూ.400 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేయనున్నారని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి తెలిపారు. ఆదివారం నాడు బద్వేలులో సీఎం పర్యటనకు సంబంధించి బహిరంగ సభ స్థలం, హెలిప్యాడ్‌, ఇతర ఏర్పాట్లను అధికారులతో కలిసి ఎంపీ అవినాశ్ రెడ్డి పరిశీలించారు.

సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా బద్వేలు పర్యటనకు వస్తుండడంతో సీఎం వైఎస్ జగన్ పర్యటన విజయవంతం చేసేందుకు అని ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా జూలై 8వ తేదీన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా కుటుంబసభ్యులతో కలిసి ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ సీఎం వైఎస్ జగన్ నివాళులు అర్పించనున్నారు. అనంతరం వైఎస్ఆర్ రైతు దినోత్సవం సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్ననున్నారు. మరోవైపు సీఎం వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here