రెండో రోజు కూడా డిప్యూటీ సీఎం వరుస సమీక్షలు..

Pawan Kalyan Is Conducting Reviews Of His Departments After Taking Charge As Deputy Chief Minister,Pawan Kalyan Is Conducting Reviews Of His Departments,Pawan Kalyan Takes Charge As Deputy Chief Minister,Deputy Chief Minister Reviews Of His Departments, Deputy CM review, Janasena, pawan kalyan, Pawan Kalyan has been busy,TDP,Pawan Kalyan Speech,Minister Pawan Kalyan,Pithapuram,Pawan Kalyan News,Janasena Latest News,AP Deputy CM News,AP Deputy CM,Amaravati News,Amaravati,Deputy CM Pawan Kalyan News,Deputy CM Pawan Kalyan,Deputy CM,Janasena Party,Pawan Kalyan Rally,Pawan Kalyan Rally LIVE,AP News LIVE,Mango News, Mango News Telugu
Pawan Kalyan has been busy , Deputy CM review,TDP,Janasena, Pawan Kalyan,

ఏపీ డిప్యూటీ సీఎం బాధ్యతలతో పాటు తనకు కేటాయించిన ఇతర మంత్రిత్వశాఖల బాధ్యతలను బుధవారం రోజు చేపట్టిన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్..మొదటి రోజు బిజీబిజీగా గడిపారు. వరుసగా శాఖాపరమైన సమీక్షలు నిర్వహించారు. బుధవారం ఉదయం గ్రామీణాభివృద్ధి శాఖల  హెచ్‌ఓడీలతో సమీక్షా సమావేశాలు నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి.. ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి కూడా విశ్రాంతి తీసుకోకుండా అటవీ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. తనకు కేటాయించిన శాఖల్లో అంశాల వారీగా అధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఆయా శాఖల్లో ప్రస్తుత పరిస్థితులపై అధికారుల నుంచి  వివరాలను అడిగి తెలుసుకుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. అధికారులు చెప్పిన విషయాలన్నీ నోట్ చేసుకున్నారు. అలాగే, ఆయా శాఖల్లో కార్యాచరణపై  త్వరలోనే మరోసారి సమీక్షా సమావేశాలు జరిపి కీలక నిర్ణయాలు తీసుకుందామని ఆయన అధికారులతో చెప్పారు.

నిన్న బిజీబిజీగా గడిపిన పవన్ కళ్యాణ్.. వరుసగా రెండో రోజూ సమీక్షలకు సిద్ధం అయ్యారు. ఈ రోజు తన శాఖలకు సంబంధించిన సోషల్ ఆడిట్, ఇంజినీరింగ్, గ్రామీణ నీటి సరఫరా విభాగాల అధికారులతో  సమీక్ష నిర్వహించబోతున్నారు పవన్‌ కళ్యాణ్. దీంతో ఈ రోజు కూడా పవన్ షెడ్యూల్ బిజీబిజీగానే ఉండబోతోంది. మరోవైపు బుధవారం బాధ్యతలను స్వీకరించిన ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌.. మొదటి సంతకాన్ని ఉపాధి హామీ పథకాన్ని ఉద్యానవన సంబంధిత పనులకు అనుసంధానించి నిధులు మంజూరు చేసే ఫైల్‌పై..రెండో సంతకాన్ని గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణానికి సంబంధించిన  ఫైల్ పై సంతకం చేసిన విషం తెలిసిందే.

ఈ రెండు ఫైల్స్‌పై సంతకాలు పెట్టడానికి ముందు ఉపాధి హామీ కూలీలకు వేతనాల చెల్లింపుల్లో ఆలస్యానికి కారణమెవరు? పంచాయతీలకు సమాంతరంగా  సచివాలయాలను  ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందని అధికారులను పవన్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అలాగే  వాటిపై స్థానిక సర్పంచ్‌లకు నియంత్రణ లేకపోతే ఎలా? ఆర్థిక సంఘం నిధులను డైరక్టుగా పంచాయతీలకు ఎందుకు ఇవ్వట్లేదని కూడా ప్రశ్నించినట్లు సమాచారం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE