గ్రామ, వార్డు సచివాలయాల పరీక్ష ఫలితాలు విడుదల చేసిన సీఎం జగన్

AP CM YS Jagan, AP Grama Sachivalayam Results, AP Grama Sachivalayam Results 2020, AP Grama Sachivalayam Results 2020 released, AP News, AP Village and Ward Secretariat Exams Results, CM releases results of Village-Ward Secretariat exam, Village and Ward Secretariat Exams Results, YS Jagan Releases Village and Ward Secretariat Exams Results

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో 13 శాఖల్లో ఖాళీగా ఉన్న 16 వేలకు పైగా పోస్టుల భర్తీకి సెప్టెంబర్ 20 నుంచి 26 వరకు రాత పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. దాదాపు 7.69 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. కాగా గ్రామ, వార్డు సచివాలయాల పరీక్ష ఫలితాలను మంగళవారం నాడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ‌మోహన్ ‌రెడ్డి విడుదల చేశారు. అభ్యర్థుల మెరిట్‌ జాబితాను గ్రామ, వార్డు సచివాలయ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఫలితాల విడుదల కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇతర పంచాయితీరాజ్, మున్సిపల్ శాఖ అధికారులు పాల్గొన్నారు. మెరిట్‌ లిస్ట్‌ ప్రకారం కేటగిరీ ఆధారంగా అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్టు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + 15 =