ఏడుగురి చందాలు వెనక్కి పంపిన జనసేన అధినేత

Pawan Kalyan,Janasena leader, YCP,TDP,MP, MLA, YCP Leaders, AP Assembly Elections, Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics, AP Elections, Mango News Telugu, Mango News
Pawan Kalyan,Janasena leader, YCP,TDP,MP, MLA, YCP Leaders

జనసేన పేరుతో చెక్‌లు ఇచ్చి పార్టీలో చేరి హడావుడి చేస్తున్న కొంతమంది నేతల పట్ల పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయంపై రెండు తెలుగు రాష్ట్రాలలో   హర్షం వ్యక్తమవుతోంది. ఇలా చెక్‌లు ఇచ్చి జనసేన సీటు తమదే  అంటూ ప్రచారం చేసుకొంటున్న ఏడుగురి చెక్‌లను పవన్ కళ్యాణ్.. మంగళవారం వెనక్కి పంపించినట్లు తెలుస్తోంది.

ఇటీవల  రాజకీయ, సీనీ ప్రముఖులు కొంతమంది జనసేన‌లో చేరారు. ఆ సందర్భంగా జనసేన పార్టీ‌కి చందాలను  చెక్ రూపంలో అందించారు. అయితే వారు నియోజక‌వర్గాలలో సీటు తమదే‌నంటూ ప్రచారం చేసుకోవడంతో  సమస్య తెచ్చి పెట్టింది. దీంతో జన‌‌సేన ఫుల్ అంటూ కొన్ని కథనాలు కూడా ప్రసారమయ్యాయి.

కొత్తగా జనసేన పార్టీలో చేరిన వారు చేస్తున్న ఈ హడావుడి వల్ల పార్టీ పెట్టినప్పుటి నుంచీ  పదేళ్ల నుంచి పార్టీ జండా మోస్తున్న నేతలు అయోమయానికి గురవుతున్నారన్న ప్రచారం జోరుగా సాగింది. ఇన్నాళ్లూ నియోజక‌వర్గంలో కార్యక్రమాలు చేస్తున్న నేతలంతా ఇక తమకు టికెట్లు దొరకవన్న నిరాశకు లోనయ్యారట. ఈ విషయాలన్నీ జనసేన అధినేత దృష్టికి రావడంతో.. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొన్న పవన్ చెక్‌లు వెనక్కి  ఇచ్చేసారు.

ఇలా  చెక్ లు ఇచ్చేయడం ద్వారా కొత్తగా చేరిన వారికి, చేరే వారికి  పవన్ తన చేతల ద్వారా స్పష్టమైన సందేశాన్ని పంపించినట్లు అయిందని పార్టీ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. కేవలం చందా ఇచ్చినంత మాత్రాన, ఆర్ధికంగా బలవంతులైనా సరే . వారికి  జనసేనలో దక్కాల్సిన  ప్రాధాన్యత మాత్రమే లభిస్తుందని చెప్పకనే చెప్పినట్లు అయిందన్న వాదన వినిపిస్తోంది.  దశాబ్ద కాలంగా జనసేన పార్టీని నమ్ముకుని పని చేస్తున్న వారికి..భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది లేదని భరోసా ఇచ్చినట్లైందన్న ప్రచారం జరుగుతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 15 =