సోషల్ మీడియాలో ఎవరైనా స్పెషల్‌గా కనిపించినా, ట్రెండింగ్‌లో ఉన్నా వారి గురించి ఇంకా తెలుసుకోవాలన్న కుతూహలంతో ఎక్కువగా వెతుకుతూ ఉంటారు. అలా ఇండియాలో ఎక్కువ శాతం మంది సెర్చ్ చేసిన వారిలో ఏపీ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఉన్నారట.సినిమాలు, వాణిజ్యం, ఆరోగ్యం, జనరల్ వార్తలు ఇలా ఎన్నో రకాల వార్తలను చూడటానికి గూగుల్‌నే చాలామంది ఆశ్రయిస్తున్నారు. విజ్ఞానంతో పాటు వినోదం కూడా కావాల్సినంత దొరకడంతో టీవీ చానెల్స్, న్యూస్ పేపర్స్ కంటే ఎక్కువగా సోషల్ మీడియానే ఎక్కువమంది ఉపయోగిస్తున్నారు. అయితే సోషల్ మీడియాలోఎవరో ఒకరి గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడానికి వెతుకుతూనే ఉంటారు.
ముఖ్యంగా ఎవరు ట్రెండింగ్ లో ఉంటారో, వాళ్ల గురించి ఎక్కువగా వెతుకుతూ ఉంటారు. అలా సినిమా, రాజకీయాలను కలిపి చూస్తే గూగుల్ ట్రెండ్స్ లో అందరికంటే నెంబర్ 1 స్థానంలో పవన్ కల్యాణ్ ఉన్నారు. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పవన్ స్థాపించిన జనసేన నూరు శాతం స్ట్రైక్ రేట్ తో గెలవడం తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశవ్యాప్తంగా సెన్సేషనల్ టాపిక్ అయ్యింది. అదే విధంగా ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పవన్ కల్యాణ్‌ని తుఫాన్ అని పిలవడం, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం పవన్ కల్యాణ్ అనే నినాదం దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందడంతో ఆ సమయంలో పవన్ గురించి జనాలు బాగా వెతికారట.
అలాగే సనాతన ధర్మం గురించి పవన్ చేసిన వ్యాఖ్యలు ఒక రేంజలో వైరల్ అవ్వడంతో పాటు మహారాష్ట్ర ఎన్నికలలో బీజేపీ కూటమి సంచలన విజయం సాధించడంలో పవన్ పాత్ర ఎక్కువగా ఉన్నాయన్న టాక్ రావడంతో పవన్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. అన్నిటి కంటే హైలెట్ గా సీజ్ ది షిప్ అంటూ తాజాగా కాకినాడ పోర్టులో పవన్ చేసిన వ్యాఖ్యలు కూడా నేషనల్ వైడ్ గా బాగా వైరల్ అయ్యాయి.
మొత్తంగా ఈ ఏడాది అంతా పవన్ గురించి తెలుసుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు.. దేశ వ్యాప్తంగా కూడా క్యూరియాసిటీ పెరిగిపోయింది. పవన్ హిస్టరీ తెలుసుకోవడానికి దేశం నలుమూలల ఉండే చాలామంది గూగుల్‌లో పవన్ కల్యాణ్ కీ వర్డ్‌తో వెతికారు. దీంతో పవన్ పేరు నెంబర్ 1 స్థానంలో వచ్చింది. అయితే క్రీడా రంగం, వ్యాపార రంగం కూడా కలిపితే మాత్రం పవన్ కళ్యాణ్ 5 స్థానంలో ఉన్నాడు. దీనిని బట్టి చూస్తూ పవన్ కల్యాణ్‌ని పాన్ ఇండియన్ పొలిటికల్ స్టార్ అని అనొచ్చు అంటూ సోషల్ మీడియాలో జనసేనాని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా హీరోలు, రాజకీయ నాయకులూ క్యాటగిరీలో పవన్ కల్యాణ్ మొదటి స్థానంలో ఉండగా.. రెండవ స్థానంలో చిరాగ్ పశ్వాన్, మూడవ స్థానంలో నరేంద్ర మోదీ, నాల్గవ స్థానంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు.