ఆర్టీసీ విలీనంపై ఏపీ ప్రభుత్వం వర్కింగ్‌ గ్రూప్‌ నియామకం

AP Government Appoints Working Group Over APSRTC, AP Government Appoints Working Group Over APSRTC Merger, Ap Political Live Updates 2019, Ap Political News, AP Political Updates, AP Political Updates 2019, APSRTC Latest News, Government Appoints Working Group Over APSRTC Merger, Mango News Telugu, Working Group Over APSRTC Merger

ఏపీఎస్‌ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఏపీఎస్‌ఆర్టీసీ వీలీన ప్రక్రియ దిశగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విలీన ప్రక్రియను పూర్తి చేసేందుకు వర్కింగ్‌ గ్రూప్‌ను నియమిస్తూ అక్టోబర్ 24, గురువారం నాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక, సాధారణ పరిపాలన, రవాణా, న్యాయశాఖకు సంబంధించిన ఏడుగురు సభ్యులను ఒక వర్కింగ్ గ్రూప్ గా నియమించారు. ప్రజారవాణా శాఖ, పోస్టులు, ఉద్యోగుల డిజిగ్నేషన్ల ఏర్పాట్లపై ఈ గ్రూప్ దృష్టి సారించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదేవిధంగా జీతాల చెల్లింపులు, పేస్కేల్ వంటి అనేక అంశాలలో తదుపరి విధివిధానాలను రూపొందించనున్నారు. నవంబర్ 15 లోగా అన్ని అంశాలను పరిశీలించి పూర్తి నివేదిక అందజేయాలని ఈ వర్కింగ్‌ గ్రూప్‌ను ప్రభుత్వం ఆదేశించింది.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + one =