జనసేనాని పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ఆయనో సంచలన నేత. దేశవ్యాప్తంగా ఆయనే హాట్ టాపిక్. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు పవన్ కళ్యాణ్. అంతేకాకుండా తమ పార్టీ తరుపున పోటీ చేసిన అందరినీ గెలిపించుకొని హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించారు. తిరుగులేని నేతగా ఎదిగారు. టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. దానితో పాటు అత్యంత కీలకమైన నాలుగు శాఖలకు మంత్రిగా పవన్ కొనసాగుతున్నారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పవన్.. వ్యూహాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్‌కు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త.. ముఖ్యంగా ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న వార్త ఒకటి వైరల్ అవుతోంది.
ఓవైపు డిప్యూటీ సీఎంగా.. మంత్రిగా కొనసాగుతూనే మరో వైపు తన చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారట. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాల్లో నటిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్‌లు మధ్యలో ఉన్నాయి. ఈక్రమంలో ఆ సినిమా డైరెక్టర్లు, నిర్మాతల నుంచి ఒత్తిళ్లు పెరిగిపోతున్నాయట. అందుకే వీలైనంత త్వరగా ఆ సినిమాలు పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారట. తిరిగి సినిమాలు తీసేందుకు సిద్ధమవుతున్నారట. అంతేకాకుండా మరికొన్ని సినిమాల్లో కూడా పవన్ కళ్యాణ్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పిఠాపురంలో జరిగిన సభలో కూడా.. తాను సినిమాల్లో నటిస్తానని పవన్ చెప్పుకొచ్చారు. దీంతో ఓవైపు పాలన.. మరోవైపు సినిమాలు చేస్తూ రెండు పడవల పైన పవన్ కళ్యాణ్ ప్రయాణం సాధ్యమేనా అన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది.
ఇప్పటికే పవన్ కళ్యాణ్ సినిమాల్లో తనకు తిరుగు లేదని రుజువు చేసుకున్నారు. కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు రాజకీయాల్లో కూడా మంచి ఫామ్‌లో ఉన్నారు. కీలకమైన బాధ్యతలను మోస్తున్నారు. ఇటువంటి సమయంలో సినిమాలపై కాకుండా పవన్ కళ్యాణ్.. రాజకీయాలపైనే ఫోకస్ పెడితే మంచిదనే వాదన వినిపిస్తోంది. కొంతకాలం పాటు పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరంగా ఉండి.. రాజకీయాలపైనే ఫుల్ ఫోకస్ పెడితే మంచిదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాజకీయ ఎదుగుదలకు పవన్‌కు మంచి అవకాశం దొరికిందని.. ఇది రాజకీయంగా పవన్ తనను తాను రుజువు చేసుకునే సమయం అని చెబుతున్నారు. సినిమాలు చేస్తూ అటు ఉప ముఖ్యమంత్రిగా, నాలుగు శాఖలకు మంత్రిగా కొనసాగడం కష్టమైన పని అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి ముందు ముందు పవన్ కళ్యాణ్ తన నిర్ణయాన్ని మార్చుకుంటారా? లేదా అన్నది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE