అభిమానులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని ఏ ముహూర్తాన పిలవడం ప్రారంభించారో తెలియదు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేతికి నిజంగానే అధికారం వచ్చేసింది. అభిమానుల నోటితోనే కాదు..అందరి నోటితోనూ ఇప్పుడు పవర్ స్టార్ Pawan Kalyan పిలిపించుకునే స్థాయికి చేరుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించాక ఇప్పుడు అందరి నోటా పవర్ స్టార్ మాటే. విజయవాడలోని ఉప ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్‌లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన మంత్రిత్వ శాఖలయిన పంచాయతీరాజ్, రూరల్ డెవలప్‌మెంట్, రూరల్ వాటర్ సప్లైస్, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల బాధ్యతలను స్వీకరించారు.
ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ విజయవాడ నీటిపారుదల శాఖ గెస్ట్ హాస్‌లో ఉన్న.. తన క్యాంప్ ఆఫీసులో ఇంద్రకీలాద్రి వేదపండితుల వేద మంత్రోచ్ఛరణల మధ్య వారి ఆశీర్వచనాలతో కొత్తగా బాధ్యతలు చేపట్టారు. దీంతో దాదాపు పదేళ్ల పాటు జనసైనికులు, పవన్ అభిమానుల నిరీక్షణకు ఈ రోజు తెరపడినట్లు అయింది. పవన్ అధికారం చేపట్టడంతో జనసేన కార్యకర్తలు, పవర్ స్టార్ అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE