ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన పవన్

pawan kalyan, janasena, ap assembly, tdp
pawan kalyan, janasena, ap assembly, tdp

జనసేనాని పవన్ కళ్యాణ్‌ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వబోమని గతంలో వైసీపీ నేతలు శపథాలు చేశారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా ఆయన్ను ఓడించి అసెంబ్లీకి రానివ్వకుండా చేస్తామని సవాల్ విసిరారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఏ గేట్లయితే తాకనివ్వబోమని వైసీపీ నేతలు సవాల్ చేశారో ఇప్పుడు అవే గేట్లు పవన్ కోసం తెరుచుకున్నాయి. ఎవరైతే శపథం చేశారో.. వారే అసెంబ్లీలో అడుగుపెట్టలేని పరిస్థితి వచ్చింది. టీడీపీ కూటమి అధికారంలోకి రావడంలో పవన్ కీలకంగా పాత్ర పోషించారు. అంతేకాకుండా తమ పార్టీ పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో.. రెండు పార్లమెంట్ స్థానాల్లో తమ అభ్యర్థలను గెలిపించుకొని తీరారు.

శుక్రవారం ఉప ముఖ్యమంత్రి హోదాలోపవన్ కళ్యాణ్ తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ముందుగా ఆయనకు పలువురు జనసేన, టీడీపీ నేతలు స్వాగతం పలికారు. ఆ తర్వాత జనసేన పార్టీకి కేటాయించిన చాంబర్‌లో చంద్రబాబు కోసం ఎదురు చూశారు. చంద్రబాబు వచ్చాక ఆయనకు పుష్పగుచ్చం అందించి స్వాతం పలికారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి అసెంబ్లీ ప్రాంగణంలోకి వెళ్లారు. తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయన చేత ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు.

ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అనగానే సభా ప్రాంగణం మొత్తం మారుమ్రోగిపోయింది. టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు ఆనందంతో బల్లలు మోగించారు. ప్రమాణ స్వీకార పూర్తయిన తర్వాత పవన్ ప్రొటెం స్పీకర్ వద్దకు వెళ్లి నమస్కరించారు. అనంతరం రిజిస్టర్‌లో సంతకం చేశారు. ప్రస్తుతం పవన్ కళయాణ్ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY