
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారాహి దీక్షకు సిద్ధమవుతున్నవారు. బుధవారం నుంచి అంటే జూన్ 26 నుంచి పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షను చేపట్టనున్నారు. మొత్తం 11 రోజుల పాటు పవన్ ఈ దీక్షను సాగించనున్నారు. ఈ దీక్షలో పవన్ కళ్యాణ్ కేవలం పండ్లు, ద్రవాహారం మాత్రమే తీసుకుంటారు. గతేడాది జూన్లో పవన్ కళ్యాణ్ వారాహి విజయయాత్రను చేపట్టిన విషయం తెలిసిందే. ఆ యాత్ర సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వారాహి దీక్షను చేపట్టారు.
అలా అప్పుడు చేసిన వారాహి విజయ యాత్ర విజయవంతం అవడమే కాదు..వారాహి విజయ యాత్ర సంకల్పం కూడా నెరవేరినట్లు అయింది. ఆ యాత్రలో ప్రతిపక్షాల ఓట్లు చీలకుండా చేస్తానని ప్రకటించిన పవన్ కళ్యాణ్.. చెప్పినట్లుగానే టీడీపీ,జనసేన,బీజేపీ కూటమిగా ఒకే తాటిపైకి రావడానికి కీలకంగా పనిచేశారు.
అలాగే కూటమి గెలుపు కోసం పవన్ శక్తి వంచన లేకుండా కృషి చేయడంతోనే కూటమి అఖండ విజయాన్నిసాధించింది. నిజానికి పవన్ వారాహి విజయ యాత్ర కూటమి విజయంలో కీలక భూమిక పోషించిందని రాజకీయ విశ్లేషకులు చెబుతారు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అఖండ విజయాన్ని అందుకోవడంతో పాటు జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలతో పాటు, రెండు పార్లమెంట్ స్థానాలలో తిరుగులేని విజయ కేతనం ఎగురవేసింది. ఇదంతా వారాహి అమ్మవారి వల్లే సాధ్యమైందని జనసేన శ్రేణులు నమ్ముతున్నారు. దీంతోనే జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 11 రోజుల పాటు దీక్ష చేపట్టాలని నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE