వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి కన్నుమూత.. సీఎం జగన్ సహా పలువురు సంతాపం

YSRCP MLC Challa Bhagiratha Reddy Passes Away CM Jagan and Others Expresses Condolences, YSRCP MLC Challa Bhagiratha Reddy Passes Away, CM Jagan Expresses Condolences, AP MLC Challa Bhagiratha Reddy, Bhagiratha Reddy Hospitalized, Bhagiratha Reddy Treated on Ventilator, Mango News, Mango News Telugu, MLC Challa Bhagiratha Reddy Health Detoirated, AP CM YS Jagan Mohan Reddy, YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates

ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి (ఎమ్మెల్సీ) సభ్యుడు చల్లా భగీరథ రెడ్డి ఈరోజు కన్నుమూశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీకి చెందిన 46 సంవత్సరాల భగీరథ రెడ్డి గత కొంతకాలంగా న్యూమోనియా, కాలేయ సంబంధిత అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఈ క్రమంలో ఆయన బుధవారం హైదరాబాద్ లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కాగా ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. భగీరథ రెడ్డి సతీమణి శ్రీ లక్ష్మి ప్రస్తుతం అవుకు వైఎస్సార్‌సీపీ జడ్పిటిసి గా ఉన్నారు. ఈ నేపథ్యంలో వారి స్వగ్రామం అవుకు మండలం ఉప్పలపాడులో విషాదం చోటుచేసుకుంది. ఇక ఉప్పలపాడులో గురువారం ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

గత ఏడాది జనవరిలో ఎమ్మెల్సీగా ఉంటూ భగీరథ రెడ్డి తండ్రి చల్లా రామకృష్ణారెడ్డి మృతి చెందగా, ఆయన స్థానంలో ఎమ్మెల్యే కోటా కింద భగీరథ రెడ్డికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. కాగా ఎమ్మెల్సీ భగీరథ రెడ్డి మృతి వార్త తెలుసుకున్న సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇంకా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, సహచర ఎమ్మెల్సీలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు భగీరథ రెడ్డి మృతికి సంతాపం తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × five =