పాలనలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు పవన్ ప్రయత్నం

Pawan Kalyan'S Efforts To Involve People In Governance,Pawan Kalyan'S Efforts To Involve People,Pawan Kalyan'S Efforts for People Governance,Janasena,Pawan Kalyan,TDP,Deputy CM review, Janasena, pawan kalyan, Pawan Kalyan has been busy,TDP,Pawan Kalyan Speech,Minister Pawan Kalyan,Pithapuram,Pawan Kalyan News,Janasena Latest News,AP Deputy CM News,AP Deputy CM,Amaravati News,Amaravati,Deputy CM Pawan Kalyan News,Deputy CM Pawan Kalyan,Deputy CM,Janasena Party,Pawan Kalyan Rally,Pawan Kalyan Rally LIVE,AP News LIVE,Mango News, Mango News Telugu
pawan kalyan, tdp, janasena, ap

జనసేనాని పవన్ కళ్యాణ్‌ను అప్పటి వైసీపీ నేతలు అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని అన్నారు. ఈసారి కూడా ఓడించి తీరుతామని శపథం చేశారు. కానీ వారికి రివర్స్ షాక్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. తాను గెలవడమే కాకుండా టీడీపీ కూటమినే గెలిపించుకొని తీరారు. 21 అసెంబ్లీ స్థానాల్లో, రెండు పార్లమెంట్ స్థానాల్లో తమ అభ్యర్థులను గెలిపించుకున్నారు. డిప్యూటీ సీఎం పదవితో పాటు అయిదు శాఖలకు మంత్రిగా పవన్ బాధ్యతలు తీసుకున్నారు. బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పవన్ పాలనలో తనదైన మార్క్ చూపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణ అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రిగా ఉన్నారు. మందు నుంచి కూడా మంత్రిగా తన బాధ్యతను అనుక్షణం గుర్తు చేసుకుంటూ పని చేస్తానని పవన్ చెబుతున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన శాఖలకు సంబంధించి నేరుగా ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలని నిర్ణయించారు. సమస్యలను చూస్తున్న ప్రజల నుంచే పరిష్కారానికి కావాల్సిన సలహాలు, సూచనలు తీసుకోవడం ద్వారా ప్రజలకు మరింత మంచి చేయొచ్చని పవన్ భావిస్తున్నారు. ఈ మేరకు ఓ గూగుల్ ఫామ్‌ను విడుదల చేశారు.

తమ శాఖలకు సంబంధించి ఎవరైనా సలహాలు, సూచలను ఇవ్వాలనుకుంటే గూగుల్ ఫామ్‌ను ఫిల్ చేయాలని పవన్ సూచించారు. పాలనలో ప్రజలను నేరుగా భాగస్వామ్యం చేయడానికి పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నారని జనసేన నేతలు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ మొదలెట్టిన కొత్త సాంకేతిక ప్రక్రియ ఏపీలో పవన్ నిర్వహించే శాఖలలో పురోగతికి దోహద పడుతుందని అంటున్నారు. ఈ మేరకు గూగుల్ ఫామ్‌కు సంబంధించిన లింక్‌ను జనసేన పార్ట అధికారిక ట్విట్టర్ పేజీలో షేర్ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ