అందరి మనసులలో స్థానాన్ని సంపాదించుకుంటున్న జనసేనాని

Pawan's Graph Is Increasing Day By Day, Pawan Graph Is Increasing, Day By Day Pawan Graph Is Increasing, Pawan's Graph, Janasena, AP CM Jagan, AP, YSRCP, TDP, BJP, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
Pawan's graph , Janasena, Ap Cm Jagan, Ap, Ysrcp,TDP, BJP

రాజ‌కీయ నాయ‌కుడంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌లా ఉండాలి.. ఇదే ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అంద‌రినోట వినిపించే మాట‌. ప్ర‌జ‌ల కోసం నిరంత‌రం ప‌రిత‌పించే వ్య‌క్తి.. రాష్ట్రం బాగోగు కోసం ఆలోచించే వ్య‌క్తి జ‌న‌సేనాని.  తాను ఏం చెప్పాలో స్ప‌ష్టంగా చెప్ప‌గ‌లిగే విజ‌న్ ఉన్న నాయ‌కుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. తాను ఎంతసేపు మాట్లాడినా.. ప్ర‌జ‌ల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి త‌ప్ప‌.. త‌న సొంత ప్రయోజ‌నాల కోసం కానీ, అధికార పార్టీ వ్యక్తిగత విషయాలను కానీ ఆవేశంలో కూడా ప్ర‌స్తావించ‌ని నాయ‌కుడు ప‌వ‌న్‌.

ప్ర‌త్య‌ర్థుల‌పై విమ‌ర్శల కంటే ప్ర‌జ‌ల‌కు తాను ఏం చేస్తాను.. ఏం చేయ‌గ‌లుగుతానో స్ప‌ష్టంగా చెప్ప‌గ‌లిగే నైజం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ది. వైసీపీలో జ‌గ‌న్ మొద‌లు ఏ నాయ‌కుడిని చూసినా ప్ర‌త్య‌ర్థుల‌పై వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు, అన‌వ‌స‌ర‌మైన రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు త‌ప్ప.. ప్ర‌జాప్ర‌తినిధులుగా తాము ప్ర‌జ‌ల‌కు ఏం చేస్తామో చెప్ప‌గ‌లిగే ద‌మ్మున్న నాయ‌కులే లేరు..కానీ ప‌వ‌న్ ఏ ప్ర‌సంగం చూసినా ప్ర‌జ‌లు, రాష్ట్ర అభివృద్ధి కోసం త‌న  విజ‌న్ ఏమిటో క‌నిపిస్తుంది. ప‌ద‌విని కోట్లు కూడ‌బెట్టుకోవ‌డానికి కాకుండా ప్ర‌జ‌ల బాగోగుల కోసం ఉప‌యోగించాల‌నేది ప‌వ‌న్ ఏకైక ల‌క్ష్యం. దోచుకో, దాచుకో జ‌గ‌న్ సిద్ధాంతం అయితే.. కంఠంలో ప్రాణం ఉన్నంత‌వ‌ర‌కు ప్ర‌జ‌లకు మేలు చేయాల‌ని త‌పించే వ్య‌క్తి జ‌న‌సేనాని.

ఎవ‌రెన్ని విమ‌ర్శ‌లు చేసినా.. ప‌వ‌న్ ను జ‌న‌సైనికులు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు అభిమానించ‌డానికి, గుండెల్లో పెట్టి చూసుకోవ‌డానికి గ‌ల ఏకైక కార‌ణం ప‌వ‌న్ నడవడిక. చెప్పిందే చేయ‌డం, చేయ‌గ‌లిగిందే చెప్ప‌డం అనేది ప‌వ‌న్ కు మాత్రమే సొంతం.ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఒక్క‌రేకాదు జ‌న‌సేన‌లో ఏ నాయకుడు మాట్లాడినా అధినేత ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగానే.. మాట్లాడేలా జనసైన్యం ఉంటుంది. ప‌వ‌న్‌ను బూతులు తిట్టి అధినాయ‌కుడి ద‌గ్గ‌ర మార్కులు కొట్టేయాల‌నేది వైసీపీ నాయ‌కుల నైజంగా ఉంటుందన్న తేడాను ఏపీ వాసులు గ్రహించారు.

అందుకే పవన్ సామాన్యులకు చేరవయిపోయారు. అత్యంత నిరాడంబరంగా మారిపోయి… తన క్రేజ్, ఇమేజ్ పక్కనపెట్టి.. ప్రజల పక్షాన సాగుతున్న మనిషిగా గుర్తింపు పొందారు. ప్రజా సమస్యల సాధనలో నేను సైతం అంటూ కదులుతుండటంతో ప్రజలంతా తమ గుండెల్లో పెట్టుకుంటున్నారు. మండుటెండలో జనం చెంతకు చేరుతూ… జనమే కావాలంటూ జనసేనాని ప్రజల్లోకి మళ్లడం ఆయన గ్రాఫ్ పెరగడానికి కూడా ఓ కారణమే. ధన రాజకీయాలకు ముగింపు పలికి జన రాజకీయాలు కావాలనే కాంక్షతో   ముందుకెళ్లడం ఆయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అందుకే మేము పవన్ ను ఓటేసి గెలిపించుకుంటాం అంటూ మీడియాల ముందుకు వచ్చి మరీ చెబుతున్న జనాలను చూసి అధికార పార్టీ ఉలిక్కిపడుతోంది .

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY