బీజేపీ ఎమ్మెల్యే మాటలు నిజమవుతాయా?

Peddireddy Is Likely To Join BJP Soon,Peddireddy,bjp,AP, YCP,cabinet meeting,Modi,Janasena,Loksabha,YCP,Pawan Kalyan,AP Polling, AP election results , Assembly Elections, Lok Sabha Elections, AP Live Updates, AP Politics, Political News,Mango News, Mango News Telugu
Peddireddy, BJP, AP, YCP

ఏపీలో వైసీపీ ఖాళీ అయ్యే అవకాశాలు క్లియర్‌గా కనిపిస్తున్నాయి. ఐదేళ్ల పాటు అధికారం లేకపోతే చాలా కష్టమని భావిస్తున్న చాలా మంది నేతల ఏపీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన వైసీపీని  వీడేందుకు..కీలక నేతలంతా తెర వెనుక మంతనాలు సాగిస్తున్నారట. మొన్నటి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి పార్టీకి కేవలం 11 అసెంబ్లీ స్థానాలు దక్కడంతో మొన్నటి వరకూ ఓ వెలుగు వెలిగిన నేతలంతా ఇప్పుడు నలుగురిలోకి వెళ్లాలంటేనే భయపడుతున్నారట. దీంతో వీలయినంత త్వరగా వైసీపీని వీడి.. కూటమిలోని ఏదొక పార్టీలోకి చేరిపోవడానికి రెడీ అవుతున్నారు.

ఇక అటు టీడీపీ కూటమికి ఏకంగా 164 స్థానాలు దక్కడంతో…వైసీపీ నేతలను టార్గెట్ చేస్తూ కొంతమంది నేతలు మాటల దాడులకు దిగుతున్నారు.  దీంతో వైసీపీలో ఉన్న కొంతమంది లీడర్లు  కమలం పార్టీలోకి  జంప్ అవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారట. ఇదే విషయాన్ని తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ హైలెట్ చేశారు.  అసెంబ్లీ లాబీల్లో  కాషాయ పార్టీ ఎమ్మెల్యే ఆదినారాయణ సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ఏపీ పొలిటికల్ స్ట్రీట్‌ను హీటెక్కిస్తున్నాయి.

బీజేపీలో చేరడానికి మిధున్ రెడ్డి బీజేపీ అగ్ర నాయకత్వంతో తాజాగా టచ్ లోకి వెళ్లారని బాంబ్‌ పేల్చిన ఆదినారాయణ రెడ్డి త్వరలో వైసీపీ ఖాళీ కావడం ఖాయంగా కన్పిస్తోందని జోస్యం చెప్పారు.  బీజేపీ పెద్దలు ఒప్పుకుంటే మాత్రం..ఒక్క అవినాష్ రెడ్డి తప్ప వైసీపీ ఎంపీలంతా పార్టీ మారడానికి రెడీగా ఉన్నారని పేర్కొన్నారు. కానీ బీజేపీ నాయకత్వం మాత్రం వాళ్లెవరూ  అక్కర్లేదని అంటోందని.. అయినా తాము చేరతామంటూ మిధున్  రెడ్డి ఇంకా లాబీయింగ్ నడుపుతున్నారని బాంబ్‌ పేల్చారు. అంతేకాదు తనతో పాటు తన తండ్రి పెద్దిరెడ్డిని  కూడా బీజేపీలో చేరాల్సిందిగా  మిధున్ రెడ్డి ఒత్తిడి తీసుకు వస్తున్నారని  ఆదినారాయణ చెప్పుకొచ్చారు.

ఇక వైసీపీ అధికారంలో ఉన్న ఈ ఐదేళ్ల కాలంలో వివిధ శాఖల్లో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరామని ఆదినారాయణ రెడ్డి అన్నారు. మద్యం, ఇసుక మాఫియాల మీదే కాదు..ఇంకా చాలా శాఖల్లో భారీ ఎత్తున అవినీతి  జరిగిందని  బీజేపీ ఎమ్మెల్యే ఆరోపణలు చేశారు. విద్యుత్ రంగంలో స్మార్ట్ మీటర్లు, పీపీఏల్లో భారీ కుంభకోణాలు జరిగాయంటూ ఆరోపించిన ఆయన.. జగన్‌ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY