మైనారిటీల ఆర్థికాభివృద్దికి పెమ్మ‌సాని భ‌రోసా.. ఇఫ్తార్ విందుల‌తో ముస్లింల‌తో మ‌మేకం

Pemmasani Assures Economic Development Of Minorities.. Iftar Feasts With Muslims, Pemmasani Assures Economic Development Of Minorities, Economic Development Of Minorities, Iftar Feasts With Muslims, Pemmasani Iftar Feasts, Pemmasani With Muslims, Economic Development Of Muslims, Lok Sabha Elections, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
Guntur Parliament , AP State Elections , TDP , YSRCP , Pemmasani

తెలుగుదేశం కూట‌మి గుంటూరు పార్ల‌మెంట్ అభ్య‌ర్థి డాక్ట‌ర్ పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ కు అన్ని వ‌ర్గాల మ‌ద్ద‌తూ ల‌భిస్తోంది. రాజ‌కీయాల‌కు అతీతంగా అంద‌రినీ క‌లుపుకుని ఆయ‌న ముందుకు వెళ్తున్న తీరు అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఎన్డీఏలో క‌ల‌వాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను వివ‌రించి ముస్లింల‌ను సైతం ఆక‌ట్టుకోవ‌డంలో డాక్ట‌ర్ పెమ్మ‌సాని స‌క్సెస్ అయ్యారు. వైసీపీ ప్ర‌భుత్వం రాష్ట్రాన్ని విచ్చిన్నం చేసింద‌ని, మ‌న ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక‌.. మ‌ళ్లీ బాగు చేసుకోవాలంటే.. కేంద్రం స‌హ‌కారం అవ‌స‌ర‌మ‌ని అందుకే బీజేపీని క‌లుపుకుని ముందుకు వెళ్తున్న‌ట్లు పెమ్మ‌సాని వివ‌రిస్తున్నారు. 2014లో బీజేపీతో పొత్తుతో అధికారంలోకి వ‌చ్చిన తెలుగుదేశం ప్ర‌భుత్వం హ‌యాంలో… ఏ ఒక్క ముస్లిం సోద‌రుడికీ ఇబ్బంది క‌లగ‌కుండా సాగిన ప‌రిపాల‌న‌ను గుర్తు చేసి ఆక‌ట్టుకుంటున్నారు.

పెమ్మ‌సాని ఆద‌ర‌ణ‌, అభిమానం గ‌మ‌నించిన ముస్లిం కుటుంబాలు కూడా ఆయ‌న‌కు మ‌ద్ద‌తు ప‌లుకుతున్నాయి. బీజేపీతో జ‌ట్టు క‌ట్టినా.. టీడీపీ వైపు మైనారిటీ యువ‌త ఆక‌ర్షితులు అవుతున్నారు. గుంటూరు ప‌ట్ట‌ణంలో దాదాపు 50 పైచిలుకు ముస్లిం కుటుంబాలు ఇటీవ‌ల పార్టీలో చేరాయి. టీడీపీతోనే ముస్లిముల అభివృద్ధి సాధ్యమని వారు న‌మ్ముతున్నారు అన‌డానికి ఇదే నిద‌ర్శ‌న‌మ‌ని పెమ్మ‌సాని చెబుతున్నారు.

రంజాన్ మాసంలో నిర్వ‌హించే ఇఫ్తార్ విందుల‌కు ప్ర‌తీచోటా ముస్లిం వ‌ర్గాలు పెమ్మ‌సానిని ఆహ్వానిస్తున్నాయి. ఎన్నిక‌ల వేళ బిజీ షెడ్యూల్ ఉన్న‌ప్ప‌టికీ.. వారి ప్రేమ‌పూర్వ‌క ఆహ్వానాల మేర‌కు.. హాజ‌ర‌వుతున్న పెమ్మ‌సాని ముస్లింల సోద‌రుల అభిమానాన్ని పొందుతున్నారు. వెళ్లిన చోట రాజ‌కీయాలకు ప్రాధాన్యం ఇవ్వ‌కుండా.. మాన‌వ‌తావాదంతో పేద ముస్లింల‌కు త‌గిన‌ సాయం చేస్తున్నారు. పెదనందిపాడు మండల కేంద్రంలో స్థానిక ముస్లిం సోదరులు నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న పెమ్మ‌సాని.. వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఒక పండగ చేసుకునే ముందు ఆ పండగ పవిత్రత గురించి ప్రతి ఒక్కరికి తెలియాలని ఆయన అభిలాషించారు. పవిత్ర రంజాన్ మాసంలో జరిగే ఈ ఇఫ్తార్ విందులో రాజకీయం మాట్లాడడం తనకి ఇష్టం లేదన్నారు. దురదృష్టవశాత్తు నేటి సమాజంలో అధిక శాతం ముస్లింలు పేదరికంలో మగ్గిపోతున్నారని, అలాంటి వారికి తాను వీలైనంత సాయం అందిస్తారని పెమ్మసాని భ‌రోసా ఇచ్చారు. ఇదే కార్య‌క్ర‌మంలో ప్రత్తిపాడు నియోజకవర్గ టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ ‘చీకటిని వదిలి వెలుగులోకి నడవండి, చెడును వీడి అభివృద్ధిలోకి వెళ్ళండి.’ అన్న అల్లాహ్ ఆదేశానుసారం ప్రతి ఒక్క ముస్లిం అనుసరించాలని కోరారు

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY