ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఫైల్స్, రిపోర్ట్స్ దహనం ఘటన ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారింది. దస్త్రాలు ఎందుకు కాల్చేశారు? డాక్యుమెంట్స్ దగ్ధం వెనుక ఎవరున్నారు? అనేది మిస్టరీగా మారింది. మరోవైపు ఈ ఫైల్స్ దగ్ధం ఘటనను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం.. విచారణను వేగవంతం చేసింది. ఇటు ఈ వ్యవహారం క్రమంగా రాజకీయ రంగు పులుముకుంటోంది. టీడీపీ, వైఎస్సార్సీపీ నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా ఈ ఫైల్స్ దగ్ధం ఘటనపై స్పందించిన మాజీ మంత్రి పేర్ని నాని..హాట్ కామెంట్స్ చేశారు.
ప్రభుత్వం టీడీపీ కూటమిదే కదా అని ప్రశ్నించిన పేర్ని నాని.. పీసీబీ, మైనింగ్ శాఖ ఫైల్స్ దగ్ధంపై విచారణ చేయండి అని కోరారు. ప్రభుత్వం వారిది అయితే.. ఫైల్స్ తగలబెడితే తమకేంటి సంబంధమని పేర్నినాని ప్రశ్నించారు. అయినా ప్రభుత్వ ఫైల్స్ దగ్ధం జరిగితే ప్రభుత్వం ఏం చేస్తుందని విమర్శించారు.అసలు దస్త్రాలు ఎక్కడి నుంచి వచ్చాయో? ఎవరు పంపించారో అన్న విషయాన్ని విచారణ చేసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. దీనిపై సీబీఐ విచారణ చేసుకుని తప్పు చేసిన వాళ్లని ఉరి తీసేయండి అంటూ పేర్ని నాని హాట్ కామెంట్లు చేశారు.
మరోవైపు జులై 8న వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతిని ఘనంగా జరపడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని నిర్ణయించారని పేర్ని నాని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని నేతలకు, కేడర్‌కు మాజీ మంత్రి పిలుపునిచ్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాల సాధన కోసమే వైసీపీ పుట్టిందని పేర్ని నాని చెప్పుకొచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE