ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం విశాఖపట్నం పర్యటనకు రానున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కొత్త ఎత్తుకు చేర్చే లక్ష్యంతో రూ. 2 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రధానంగా అనకాపల్లి జిల్లా పూడిమడకలో రూ.1.85 లక్షల కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటు చేయనున్నారు, ఇది 57 వేల మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది.
విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయం, అనకాపల్లి బల్క్ డ్రగ్ పార్క్, విస్తరించిన రహదారులు, కొత్త రైల్వే లైన్లకు శంకుస్థాపనలు జరుగుతాయి. ప్రధాని ప్రసంగంతో పాటు, ఆయన రోడ్ షోలో పాల్గొని ప్రజలను ఉత్సాహపరుస్తారు. ఇది కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ప్రధాని రాష్ట్రంలో చేసిన తొలి పర్యటన కావడం విశేషం.
ప్రధాని ముఖ్య కార్యక్రమాలు:
రూ. 1.85 లక్షల కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ హబ్
దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయం
అనకాపల్లి బల్క్ డ్రగ్ పార్క్
ఎన్హెచ్-167, 440, 516 రహదారుల విస్తరణ
గుత్తి-పెండేకల్లు రైల్వే లైన్ డబ్లింగ్
మరో 10కు పైగా ప్రాజెక్టులకు శంకుస్థాపన
టూర్ షెడ్యూల్:
సాయంత్రం 4.15కు విశాఖ చేరుకుంటారు
రోడ్ షో 4.45 నుండి 5.30 వరకు
శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు సాయంత్రం 5.30 నుండి 6.45 వరకు
7.15 గంటలకు భువనేశ్వర్‌కు బయలుదేరుతారు