
ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ కొన్ని ప్రాంతాల్లో రాజుకున్న హింసాత్మక ఘటనల ఆనవాళ్లు ఇంకా చల్లారనే లేదు. దీంతో రాజకీయ నేతల స్వార్థానికి అమాయక ప్రజలు బలైపోతున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. పోలింగ్ పూర్తయి రెండు రోజులు దాటుతున్నా అదే ఉద్రిక్తవాతావరణం మధ్య ప్రజలు గడపాల్సిన పరిస్థితి తలెత్తింది.
ముఖ్యంగా అనంతపురం, గుంటూరు, అన్నమయ్య జిల్లాల్లో ప్రశాంతంగా జరగాల్సిన పోలింగ్‌ను..అక్కడివారు తమకు వ్యతిరేకంగా ఉన్నారన్న సాకుతో అధికారపక్ష నేతలు కురుక్షేత్రంగా మార్చేయడంతో ఆ మంటలు ఇంకా రగులుతూనే ఉన్నాయి. ఎన్నికల కోడ్ నిబంధనలను లెక్కచేయని కొంతమంది..ప్రతిపక్ష పార్టీల నేతలపై, కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారని, తెలుగు దేశం పార్టీ ఏజెంట్లను కిడ్నాప్ కూడా చేశారనే వార్తలు వినిపించాయి.
వైఎస్సార్సీపీ అభ్యర్థి ఓటరుపై దాడికి పాల్పడం, అలాగే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులు, తెలుగు దేశం పార్టీ నేత అనుచరుల మధ్య ఘర్షణ చోటు చేసుకోగా, ఆ ఘర్షణను అడ్డుకోవడానికి టీడీపీ నేత అక్కడ నుంచి వెళ్లినపోయినా.. కేతిరెడ్డి పెద్దారెడ్డి మాత్రం అక్కడే ఉండి అనుచరులను రెచ్చగొట్టారన్న ఆరోపణలున్నాయి. ఈ ఘర్షణలో పెద్దారెడ్డి కారు అద్ధాలతో పాటు పోలీసు వాహనాలు కూడా ధ్వంసమవడంతో..పెద్దారెడ్డిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఎన్నికలు ముగిసి రెండు రోజులు పూర్తయినా.. ఇప్పటికీ కూడా పల్నాడు జిల్లా మాచర్లలో మారణహోమం రగులుతూనే ఉంది. దీంతో ప్రజలు ఇళ్లలో నుంచి ఎవరూ బయటకు రావటం లేదు. 2వేల మందికి పైగా పోలీసులు,కేంద్ర బలగాలుతో అక్కడ మోహరించి కాపలా కాస్తున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు అతని సోదరుడు వెంకట్రామిరెడ్డి కూడా గృహ నిర్భంధంలో ఉన్నారు.దీంతో ఇన్నాళ్లలో ఇలాంటి సీన్ ఎప్పుడూ చూడలేదంటూ ఏపీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY