ఏపీలో అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలు విడుదల

AP Government Released Unlock 5.0 Guidelines

కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అన్‌లాక్‌ 5.0 మార్గదర్శకాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అన్‌లాక్‌ 5.0 మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలో పాటించాల్సిన మార్గదర్శకాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీలో అమలు కానున్న అన్‌లాక్‌ 5.0 మార్గదర్శకాలు:

  • రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం తప్పనిసరి.
  • సినిమా థియేటర్స్, షాపింగ్ మాల్స్, ఇతర షాపుల వద్ద శానిటైజర్లు ఏర్పాటు చేయాలి.
  • బస్సులు, ఆటోలు, ట్యాక్సీలు వంటి ప్రజారవాణాలో కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలి.
  • అన్ని ప్రార్థనా మందిరాల్లో కరోనా నిబంధనలు పాటించాలి.
  • షాపింగ్ మాల్స్‌, సినిమా థియేటర్ల లోకి మాస్కులు లేకుంటే అనుమతించకూడదు.
  • కరోనా నిబంధనలు అమలయ్యేలా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి నియమించాలని ఆదేశాలు.
  • బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో కరోనా నిబంధనలపై మైకుల ద్వారా ప్రచారం.
  • సినిమా థియేటర్లలోనూ కరోనా ప్రచార ప్రకటనలు ప్రదర్శించాలని ప్రభుత్వం ఆదేశాలు.
  • పాఠశాలలు, విద్యా సంస్థలు, పారిశ్రామిక రంగంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.
  • అన్ని పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రతి పీరియడ్ తర్వాత శానిటైజేషన్ చేసుకునేలా యాజమాన్యాలకు ఆదేశాలు.
  • స్వచ్చంధంగా కరోనా పరీక్ష చేయించుకునేలా ప్రజలు ముందుకు వచ్చేలా ప్రజల్లో వాలంటీర్ల ద్వారా అవగాహన కల్పించాలని ఆదేశాలు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 4 =