
కాళేశ్వరం ప్రాజెక్టుపై వచ్చిన ఆరోపణలపై జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ బహిరంగ విచారణకు రెడీ అవుతోంది . అయితే త్వరలో మరోసారి ఆకస్మిక పర్యటనలకు రెడీ అవుతోన్న జస్టిస్ చంద్రఘోష్ కమిషన్. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు ఇవ్వబోతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. గురువారం హైడ్రాలజీ, నిపుణుల కమిటీలను విచారించిన జస్టిస్ ఘోష్ కమిషన్.. శుక్రవారం ఇంకొందరిని పిలిచింది.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో తాము గుర్తించిన అంశాలను వివరించిన రెండు కమిటీలు.. ఎక్కువ నీటిని నిల్వ చేయడం వలనే ఇలాంటి సమస్య తలెత్తినట్లు చెప్పినట్లు తెలుస్తోంది. రెండు వారాల లోపు మధ్యంతర నివేదికతో పాటు, పూర్తిస్థాయి నివేదికను సాధ్యమైనంత త్వరగా అందించాలని రెండు కమిటీల ఇంజినీర్లను జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ ఆదేశించింది. అలాగే టెక్నికల్ అంశాలపై కూడా అఫిడవిట్ ఫైల్ చేయాలంటూ నిపుణుల కమిటీలకు సూచించింది. అఫిడవిట్లను పరిశీలించిన తర్వాత బహిరంగ విచారణ చేయడానికి జస్టిస్ పీసీ ఘోష్ సిద్ధమవుతున్నారు. దీనిలో సంబంధం ఉన్న వారికి నోటీసులు ఇవ్వడానికి గ్రౌండ్ వర్క్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ నీటిపారుదల మంత్రి హరీష్ రావుకు నోటీసులిచ్చే అవకాశాలున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
అటు విజిలెన్స్ ఇచ్చిన మధ్యంతర నివేదికను సమర్పించాలని గతంలోనే జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ ఆదేశించినా.. అది ఇప్పటివరకు చేరకపోవడంతో..ఆ నివేదికను వెంటనే సమర్పించాలని మరోసారి ప్రభుత్వానికి, విజిలెన్స్ విభాగానికి లెటర్ రాయనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ ఆకస్మిక పర్యటనలకు వెళ్లాలని అనుకున్నట్టు తెలుస్తోంది. టెక్నికల్ అంశాల తర్వాత ఆర్థిక అంశాలపై కమిషన్ దృష్టి సారించనుంది. అలాగే ఆనకట్ట నిర్మాణ అంచనాలు, రుణాలు, వడ్డీ రేట్లపై కమిషన్ విచారణ చేయనుంది.
విచారణలో భాగంగా ఇటీవల ఎల్ అండ్ టీ, ఆఫ్కాన్ కన్‌స్ట్రక్షన్, నవయుగ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు.ఈ ఆరోపణలపై కమిషన్ వీరిని వివరణ కోరగా.. తమకు టైం బౌండ్ పెట్టారని నిర్మాణ కంపెనీల ప్రతినిధులు చెప్పారు. ప్రభుత్వం విధించిన సమయంలో తాము ప్రాజెక్టు పూర్తి చేసి ఇచ్చామని వివరించారు. ఇదే విషయాన్ని తమకు అఫిడవిట్ రూపంలో సమర్పించాలని కమిషన్ వారికి సూచించింది. అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై రిపోర్ట్ ఇవ్వడానికి జూన్ 30న డెడ్ లైన్ కావడంతో నిర్మాణ కంపెనీల నుంచి, అధికారుల నుంచి, సంబంధిత వ్యక్తుల నుంచి కమిషన్ అన్ని వివరాలను సేకరిస్తోంది. మరి ఇది ఎలాంటి మలుపులు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE