ఇప్పటికే వాయుగుండం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే. వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని చాలాచోట్ల కురుస్తున్న భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ వానలతో ప్రజలు వణికిపోతున్నారు. వర్షాలు తగ్గుముఖం పడుతాయని అనుకునే లోపే వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. మరో తుఫాన్ రాబోతుందనీ.. ఏపీలో వర్షాలు పడబోతున్నాయని తెలిపింది. ఈ నెల 6, 7 తేదీల్లో ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో, మరోసారి ఆందోళన మొదలైంది. అది తుఫానుగా బలపడి ఉత్తరాంధ్ర, ఒడిశా మధ్య తీరం దాటుతుందని అధికారులు అంచనా వేశారు. అల్పపీడనంపై మరో రెండు రోజుల్లో స్పష్టత రానుంది.
కాగా ఇప్పటికే వర్షాభావంతో జనజీవనం , రవాణా వ్యవస్థ స్థంభించింది. ఊర్లకు ఊర్లే వరదలో కొట్టుకుపోయాయి. వేలాది ఎకరాలు పంట పొలాలు నాశనమయ్యాయి. వందలాది ఇల్లులు నేలమట్టం అయ్యాయి. ఇక విజయవాడ అయితే పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయింది. బుడమేరు ముంపు నుంచి కాపాడేందుకు చేసిన ఎన్ని ప్రయత్నాలు చేసినా… ప్రకృతి ప్రకోపం ముందు అవేవి ఫలించలేదు. పశ్చిమ, మధ్య నియోజకవర్గాల్లోని చాలా ప్రాంతాలు నీట చిక్కుకోవడంతో పాటు కరెంట్ లేకపోవడంతో ప్రజలు దిక్కు తోచని స్థితిలో ఉండిపోయారు. ఏపీ చంద్రబాబు నీట మునిగిన వరద ప్రాంతాల్లో సహాయ పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే వాయుగుండం ప్రభావంతో ఏపీ లో భారీ వర్షాలతో ప్రజలు అల్లాడుతున్నారు. అంతేకాదు వరద ప్రాంతాల్లో ప్రజలు కంటిమీద కునుకు లేకుండా కాలం వెళ్లదీస్తున్నారు. మరోవైపు కేంద్రం నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి వరదలో చిక్కుకున్న వారిని కాపాడే పనిలో పడ్డాయి.
ఇక తెలంగాణ లో ముంపు బాధితుల కోసం ప్రస్తుతం 45 పునరావాస కేంద్రాలను తెరచి, 2,500 మందికిపైగా తరలించామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 85 చెరువులు, కుంటలు, కాలువలకు గండ్లు పడ్డాయని ప్రాథమిక సమాచారం అందిందని తెలిపారు. వరద తీవ్రత అధికంగా ప్రాంతాలకు ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలతోపాటు సహాయ సహకారాలు అందిస్తున్నామని పేర్కొన్నారు.