ఏపీలో రెచ్చిపోతున్న బెట్టింగ్ రాయుళ్లు

Betting Rush From Sending Seats To Winnings, Betting Rush, Sending Seats To Winnings, Betting, Andhra Pradesh Elections 2024, Betting Mode On In AP, Political Betting In AP, Betting on AP, Betting Mode On, Andhra Pradesh Elections, AP Political News, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
andhra pradesh elections 2024 betting mode on in ap telugu news

ప్రతీఏడాది ఏప్రిల్‌ వచ్చిందంటే దేశమంతా ఐపీఎల్‌ ఫీవర్‌ కమ్మేస్తుంది. ఈ సారి కాస్త ముందుగానే ఐపీఎల్‌ ఫీవర్‌ స్టార్ట్ అయినా మరోవైపు మరో ఫీవర్‌ ప్రజలున ఊపేస్తోంది. అదే ఎలక్షన్‌ ఫీవర్‌. నిజానికి ఇది ఫీవర్‌ కాదు.. టైఫాయిడ్‌ అనే చెప్పాలి.. ఎందుకంటే ఎక్కడ చూసినా ఎన్నికల గురించే చర్చ.. ముఖ్యంగా ఏపీలో పాలిటిక్స్‌ గురించి మాట్లాడుకోని ఇల్లు ఉండదు. రానున్న ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. కొందరు వైసీపీ ఇంటికి వెళ్తుందని.. మరికొందరు అధికారాన్ని నిలబెట్టుకుంటుందని ముచ్చటించుకుంటున్నారు. ఇంకొందరు పవన్‌ సీఎం అయ్యే అవకాశాల్ని కొట్టిపారేయలేమంటున్నారు. ఇంతటి ఉత్కంఠ రేపుతున్న ఏపీ పాలిటిక్స్‌ను చూస్తూ బెట్టింగ్‌ రాయుళ్లు ఊరుకుంటారా? వందలు, వేలు, లక్షలు బెట్ కాస్తున్నారు. ఓవైపు ఐపీఎల్‌ బెట్టింగ్‌లకు చాలా మంది డబ్బులు పొగొట్టుకోని బలవుతుంటే ఇప్పుడు వీరు కూడా తయారవుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఎడ్జ్ ఎవరికి ఉంది?

ఎన్నికలు దగ్గర పెడుతున్న వేల ఏపీలో బెట్టింగ్‌లు జోరందుకున్నాయి. స్టాక్ మార్కెట్ లాగానే ఇక్కడ కూడా కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం మొదలైనప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ, వైసీపీ, జనసేన సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. పత్రికలు, వార్తా ఛానళ్ల నుంచి వినిపిస్తున్న మాటలు ఎలా ఉన్నా ఏ పార్టీకి ఆ పార్టీ గెలుపుపై ధీమా వ్యక్తం  చేస్తున్నాయి. అటు బుక్‌మేకర్‌లు సాధారణ నివేదికల ఆధారంగా వారి సొంత అంచనాలను కలిగి ఉంటారు. గ‌త వారం వైసీపీకి అనుకూలంగా బెట్టింగ్ వ్య‌వ‌హారాల్లో మార్పు వ‌చ్చిందట. అంతకుముందు ఎన్నికల ప్రచారానికి ముందు తెలుగుదేశం పార్టీకి స్వల్ప ఆధిక్యం లభించిందట. పొత్తుల ఏర్పాటు, బీజేపీ రంగంలోకి దిగడం, టిక్కెట్ల పంపిణీ అంశాలు టీడీపీ లాభిస్తుందని కొందరు.. చెడు చేసిందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

డబ్బులు పొగొట్టుకోవద్దు:

బెట్టింగ్‌ అన్నది వ్యసనం. ఒకసారి అలవాటు అయితే అది వదలదు. బెట్టింగ్‌ కారణంగా ఇల్లు, ఇతర ఆస్తులు అమ్ముకున్న కుటుంబాలు కోకొల్లలు. చాలా కుటుంబాలు కేవలం బెట్టింగ్‌ వల్ల బజారున పడ్డాయి. ఒక సారి డబ్బులు వచ్చాయి కదా అని మరింత ఆశకు పోయి రెండో సారి, మూడో సారి.. వందో సారి ఇలా బెట్టింగ్‌ ఓ అడిక్షన్‌గా మారుతుంది. చివరకు పోయిన డబ్బులను తిరిగి సంపాదించడానికి అప్పు చేయాల్సి వస్తుంది. ఆ అప్పును తీర్చడానికి మరొక అప్పు.. ఇలా జీవితమంతా అప్పులమయం చేసుకుంటున్నారు బాధితులు. అందుకే వీటికి దూరంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 1 =