ఏపీలో రేషన్ డోర్ డెలివరీ ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభం: సీఎం జగన్

Andhra Pradesh YSR Rice Doorstep Delivery Scheme 2020, Ap Ration Home Delivery, CM YS Jagan, Mango News, Ration Door Delivery in AP, Ration Home Delivery, Ration Home Delivery In AP, Ration Home Delivery System, Ration Home Delivery System In Andhra, Ration Home Delivery to Start from February 1st, YSR Rice Doorstep Delivery Scheme, YSR Rice Doorstep Delivery Scheme 2020

రాష్ట్రంలో రేషన్ డోర్ డెలివరీ చేయాలని ఆంధప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రేషన్ డోర్ డెలివరీ, ధాన్యం సేకరణపై సోమవారం నాడు క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఇంటి వద్దనే రేషన్ సరుకుల పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ముందుగా ఇంటి వద్దకే రేషన్ పంపిణీ కోసం సిద్ధం చేసిన ప్రత్యేక వాహనాలను జనవరి 3 వ వారంలో ప్రారంభించాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. అలాగే వాహనాల ప్రారంభం రోజునే రేషన్ కార్డుదారులకు పంపిణీ చేసే 10 కిలోల రైస్‌ బియ్యం సంచుల ఆవిష్కరణ కూడా చేయనున్నట్టు తెలిపారు.

రేషన్ పంపిణి కోసం 9260 మొబైల్‌ వాహన యూనిట్లు, అదే సంఖ్యలో తూకం యంత్రాలు మరియు 2.19 కోట్ల నాన్‌ ఓవెన్‌ క్యారీ బ్యాగులు ఇప్పటికే సిద్ధం చేసినట్టు తెలిపారు. రేషన్ పంపిణీ వాహనాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, ముస్లిం, క్రిస్టియన్‌ మైనారిటీలకు కేటాయిస్తున్నామన్నారు. వాహనాలకు సంబంధించి 30 శాతం సబ్సిడీ ఇస్తుండగా, 60 శాతం బ్యాంకు రుణం, 10 శాతం లబ్ధిదారుడి వాటాగా కట్టాల్సి ఉంటుందని చెప్పారు. మరోవైపు ధాన్యం సేకరణలో రైతులకు 15 రోజుల్లోగా డబ్బులు అందేలా చూడాలని, ఇప్పటికి సేకరించిన ధాన్యానికి సంబంధించి సంక్రాంతి పండుగ కల్లా రైతులకు డబ్బును చెల్లించాని అధికారులకు సీఎం వైఎస్‌ జగన్‌ సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ