ఇయర్‌ ఫోన్స్ పెట్టుకుని డ్రైవింగ్‌ చేస్తే రూ.20 వేల జరిమానా?

AP Govt Likely to Fine upto Rs20 Thousand For Driving While Wearing Earphones in Soon,AP Govt Likely to Fine upto Rs20 Thousand,20 Thousand For Driving While Wearing Earphones,Fine upto Rs20 Thousand For Wearing Earphones,Fine upto Rs20 Thousand Wearing Earphones in Soon,AP Govt Likely to Fine Wearing Earphones,Mango News,Mango News Telugu,Driving with earphones in AP,Rs 20000 Fine For Driving With Earphones,Driving With Earphones,Penalty for driving with headphones,AP Govt Fine Latest News,AP Govt Fine Latest Updates

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం కొత్త ఆర్టీవో రూల్స్ తీసుకొస్తుందనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. చాలా వరకు రోడ్డు ప్రమాదాలు సెల్‌ఫోన్‌ చూస్తూనో.. మాట్లాడుతూనో ఉన్నప్పుడే జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఇలాంటి కేసులు ఎక్కువ అయ్యాయని అందుకే ఏపీ ప్రభుత్వం వీటి నివారణపై దృష్టిపెట్టిందని అంటున్నారు.

సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ కొందరు డ్రైవింగ్ చేస్తుంటారు. మరికొందరు ఎవరికీ కనిపించకుండా బ్లూటూత్‌ ఇయర్‌ఫోన్స్ పెట్టుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. మరికొందరు హెడ్‌సెట్‌ పెట్టుకొని జాలీగా వెళ్లిపోతుంటారు. ఇలాంటి వారికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సీరియస్‌గా ఓ నిర్ణయం తీసుకుందని సోషల్‌ మీడియాలో వార్త వైరల్‌గా మారుతోంది. డ్రైవింగ్ చేస్తూ ఇయర్ ఫోన్స్, హెడ్‌సెట్ పెట్టుకుంటే రూ.20 వేలు జరిమానా విధించబోతోందని ఆ వార్త సారాంశం. ఆగస్టు నెల నుంచి ఇది ప్రారంభం కానుందని కూడా చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో బైక్ మీద కానీ.. కారులో కానీ.. ఆటోలో కానీ.. ఇయర్ ఫోన్స్ లేదా హెడ్సెట్ పెట్టుకొని డ్రైవింగ్ చేస్తే రూ.20 వేలు జరిమానా వేస్తారని పుకార్లు ఉన్నాయి. దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే రవాణా శాఖ అధికారులు వెల్లడించబోతున్నట్టు కూడా చెబుతున్నారు.

ఇలా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ కంటెంట్‌పై నిజనిర్దారణ కోసం ఏబీపీ దేశం ప్రభుత్వాన్ని సంప్రదించింది. అయితే రవాణా శాఖాధికారులు తమకు అలాంటి అదేశాలు ఇంకా రాలేదని చెబుతున్నారు. దీనిపై తమకు ఎలాంటి సమాచారం లేదని కూడా చెబుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 4 =