ఏపీ ఎన్నికల్లో ఘోర పరాభవం పాలయి కష్టకాలంలో ఉంది వైసీపీ. గత ఎన్నికల్లో 151 స్థానాలను గెలుచుకున్న వైసీపీ.. ఈసారి కేవలం 11 స్థానాల్లో మాత్రమే జెండా ఎగురవేయగలిగింది. వైసీపీలోని కీలక నేతలు కూడా ఈసారి ఓటవిని చవిచూశారు. అసలే కష్టకాలంలో ఉన్న వైసీసీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక దళిత నేత రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ అధిష్టానానికి పంపించారు. తాజా ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిన తెలుగు దేశం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆయన మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు.
2014లో రావెల కిశోర్ బాబు తెలుగు దేశం పార్టీలో చేరారు. ఆ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఆ ఎన్నికల్లో తెలుగు దేశం కూటమి గెలుపొంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో కిశోర్ బాబుకు తన మంత్రి వర్గంలో చంద్రబాబు నాయుడు స్థానం కల్పించారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఆయనకు పదవి కట్టబెట్టారు. కానీ కిశోర్ బాబు చేసిన కొన్ని పనుల వల్ల ఆయన మంత్రి పదవి పోయింది. ఆయన కుమారుడి వ్యవహార శైలి వివాదాస్పదం కావడంతో పాటు.. అందుకు సంబంధించిన వీడియోలు కూడా పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. దీంతో చంద్రబాబు.. కిశోర్ బాబును మంత్రి పదవి నుంచి తప్పించారు. దీంతో అప్పట్లో కిశోర్ టీడీపీ పార్టీకి కూడా రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు.
2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ప్రత్తిపాడు నుంచి జనసేన తరుపున పోటీ చేశారు. కానీ ఈసారి మేకతోటి సుచరిత చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత కొద్దిరోజులకు బీజేపీలోకి వెళ్లారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తమ పార్టీని ఏపీలోకి విస్తరించాక.. కిశోర్ బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. చివరికి 2024 ఎన్నికల ముంగిటి వైసీపీ గూటికి వెళ్లారు. కానీ జగన్ ఆయనకు ఎక్కడ టికెట్ కేటాయించలేదు. అయినప్పటికీ పార్టీ గెలుపు కోసం రావెల పని చేశారు. వైసీపీ నేతలతో కలిసి విస్తృతంగా ప్రచారం చేశారు. టీడీపీపై విమర్శలు కూడా గుప్పించారు. టీడీపీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతోందంటూ వైసీపీ నేతలతో కలిసి ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు.
కట్ చేస్తే.. ఇప్పుడు వైసీపీ రావెల కిశోర్ రాజీనామా చేసి టీడీపీ పాట పాడుతున్నారు. దళితుల అభ్యున్నతి, సంక్షేమం టీడీపీతోనే సాధ్యమని తాజాగా వెల్లడించారు. ఈక్రమంలో రావెల కిశోర్ బాబు తెలుగు దేశం పార్టీలో చేరబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి చూడాలి రావెల టీడీపీ తీర్థం పుచ్చుకుంటారా? లేదా? అన్నది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY