ఎన్నికల విధులలో వారి నియామకానికి గ్రీన్ సిగ్నల్

Relief for Jagan government,CEC Green signal ,election duties,CEC, YCP, Jagan, AP Assembly elections, Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics, AP Elections, cm jagan mohan reddy, Mango News Telugu, Mango News
Relief for Jagan government,CEC Green signal ,election duties,CEC, YCP, Jagan

అధికార వైఎస్సార్ పార్టీకి  ఈసీ నుంచి స్వల్ప ఊరట లభించింది. ఎలక్షన్ విధుల కోసం గ్రామ సచివాలయ సిబ్బంది నియామకానికి ఒప్పుకుంటూ.. కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వైసీపీపికి ఊరట లభించినట్లు అయింది. అటు వాలంటీర్ల కేటాయింపుపైన కూడా అధికార వైసీపీకి ఈసీ  క్లారిటీ ఇచ్చింది. ఎలక్షన్ డ్యూటీలో సచివాలయ సిబ్బందిని వినియోగించుకోవచ్చని సీఈసీ వైసీపీకి సూచించింది.

కానీ సచివాలయ సిబ్బందికి ఇంకు పూసే పనిని మాత్రం అప్పగించాలని, ప్రతి పోలింగ్ బూత్‌లో కేవలం ఒకరికి మాత్రమే అనుమతించినట్లు  స్పష్టం చేసింది. అలాగే వాలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా అనుమతించ వద్దని ఈసీ ఆదేశించింది. గతంలో బీఎల్వోగా పని చేసిన వారిని కూడా ఇప్పుడు జరిగే  ఎలక్షన్  విధులకు తీసుకోవద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.  ఏపీలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఈవో మీనా ఈ ఆదేశాలను పంపారు.

ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ఇప్పటికే ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. వైనాట్ 175 అంటూ సీఎం జగన్ తన రాజకీయ చతురతో వ్యూహాలు రచిస్తుండగా.. జగన్‌ను ఎలా అయినా ఓడిస్తామంటూ టీడీపీ, జనసేన పార్టీలు కదనరంగంలో దిగుతున్నాయి. అయితే  రాబోయే అసెంబ్లీ ఎన్నికల విధులకు సచివాలయ సిబ్బందితో పాటు, వాలంటీర్లను కూడా వినియోగించుకోవాలని  వైసీపీ సర్కార్ భావిస్తోంది.

అధికార వైసీపీ నిర్ణయానికి ప్రతిపక్షనాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లును వైసీపీ ప్రభుత్వమే నియమించింది కాబట్టి వారంతా  వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తారని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ అభిమానులను మాత్రమే ఈ విధులకు ఉపయోగించుకుంటున్నారన్న వాదన ఏపీలో గట్టిగా వినిపిస్తోంది. అయితే ఇప్పుడు  సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు  ఎన్నికల విధులలో పాల్గొనవచ్చంటూ.. కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY